Ezekiel 5:11 in Telugu 11 కాబట్టి నా ప్రాణం పైన ఒట్టు” ఇది ప్రభువైన యెహోవా ప్రకటన. “నీ అసహ్యమైన విషయాలతో నా మందిరాన్ని అపవిత్రం చేశావు కాబట్టి నేను నీ సంఖ్యను కచ్చితంగా తగ్గిస్తాను. నీ మీద కనికరం చూపను. నిన్ను కాపాడను.
Other Translations King James Version (KJV) Wherefore, as I live, saith the Lord GOD; Surely, because thou hast defiled my sanctuary with all thy detestable things, and with all thine abominations, therefore will I also diminish thee; neither shall mine eye spare, neither will I have any pity.
American Standard Version (ASV) Wherefore, as I live, saith the Lord Jehovah, surely, because thou hast defiled my sanctuary with all thy detestable things, and with all thine abominations, therefore will I also diminish `thee'; neither shall mine eye spare, and I also will have no pity.
Bible in Basic English (BBE) For this cause, by my life, says the Lord, because you have made my holy place unclean with all your hated things and all your disgusting ways, you will become disgusting to me; my eye will have no mercy and I will have no pity.
Darby English Bible (DBY) Wherefore, [as] I live, saith the Lord Jehovah, verily because thou hast defiled my sanctuary with all thy detestable things, and with all thine abominations, therefore will I also withdraw mine eye, and it shall not spare, nor will I have any pity.
World English Bible (WEB) Therefore, as I live, says the Lord Yahweh, surely, because you have defiled my sanctuary with all your detestable things, and with all your abominations, therefore will I also diminish [you]; neither shall my eye spare, and I also will have no pity.
Young's Literal Translation (YLT) Therefore, I live -- an affirmation of the Lord Jehovah: Because My sanctuary thou hast defiled, With all thy detestable things, And with all thine abominations, Mine eye pitieth not, and I also spare not. Do not even I also diminish?
Cross Reference Numbers 14:28 in Telugu 28 నువ్వు వారితో, యెహోవా చెప్పేదేమంటే, నేను జీవంతో ఉన్నట్టు, మీరు నాతో చెప్పినట్టు నేను కచ్చితంగా మీపట్ల చేస్తాను.
Deuteronomy 7:25 in Telugu 25 వారి దేవతా ప్రతిమలను మీరు అగ్నితో కాల్చివేయాలి. వాటి మీద ఉన్న వెండి బంగారాల మీద ఆశ పెట్టుకోకూడదు. మీరు దాని ఉచ్చులో పడతారేమో. అందుకే వాటిని మీరు తీసుకోకూడదు. ఎందుకంటే అది మీ యెహోవా దేవునికి అసహ్యం.
Deuteronomy 29:20 in Telugu 20 యెహోవా అలాంటివాణ్ణి క్షమించడు. యెహోవా కోపం, రోషం అతని మీద రగులుకుంటుంది. ఈ గ్రంథంలో రాసి ఉన్న శాపాలన్నీ వాడికి ప్రాప్తిస్తాయి. యెహోవా అతని పేరు ఆకాశం కింద ఉండకుండాా తుడిచివేస్తాడు.
2 Kings 21:4 in Telugu 4 ఇంకా “నా పేరు యెరూషలేములో శాశ్వతంగా ఉంచుతాను” అని యెహోవా చెప్పిన ఆ యెరూషలేములో అతడు యెహోవా మందిరంలో బలిపీఠాలు కట్టించాడు.
2 Kings 21:7 in Telugu 7 యెహోవా దావీదుకు, అతని కొడుకు సొలొమోనుకు ఆజ్ఞ ఇచ్చి “ఈ మందిరంలో ఇశ్రాయేలు గోత్రస్దానాల్లోనుంచి నేను కోరుకున్న ఈ యెరూషలేములో నా పేరు ఎల్లకాలం ఉంచుతాను” అని దేన్నీ గురించి చెప్పాడో ఆ యెహోవా మందిరంలో తాను చేయించిన అషేరా రూపాన్ని పెట్టాడు.
2 Kings 23:12 in Telugu 12 ఇంకా యూదా రాజులు చేయించిన ఆహాజు మేడ గది మీద ఉన్న బలిపీఠాలనూ, యెహోవా మందిరపు రెండు ప్రాంగణాల్లో మనష్షే చేయించిన బలిపీఠాలనూ, రాజు పడగొట్టించి ముక్కలు ముక్కలుగా చేయించి ఆ చెత్త అంతా కిద్రోను వాగులో పోయించాడు.
2 Chronicles 33:4 in Telugu 4 “యెరూషలేములో నా పేరు ఎప్పటికీ ఉంటుంది” అని యెహోవా ఏ స్థలాన్ని ఉద్దేశించి పలికాడో అదే యెహోవా మందిరంలో అతడు అన్య దేవుళ్ళకు బలిపీఠాలను కట్టించాడు.
2 Chronicles 33:7 in Telugu 7 “ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో నాపేరు ఎల్లప్పుడూ ఉంచుతాను.
2 Chronicles 36:14 in Telugu 14 అంతేకాక యాజకులూ ప్రజల్లో నాయకులంతా అన్య ప్రజలు చేసే నీచమైన పనులు చేస్తూ యెరూషలేములో యెహోవా ప్రతిష్టించిన మందిరాన్ని అపవిత్ర పరచారు.
Psalm 95:11 in Telugu 11 కాబట్టి, వాళ్ళు నా విశ్రాంతి స్థలంలో ఎన్నడూ ప్రవేశించరని నేను నా కోపంలో శపథం చేశాను.
Psalm 107:39 in Telugu 39 వారు బాధ వలనా ఇబ్బంది వలనా దుఃఖం వలనా తగ్గిపోయినప్పుడు,
Jeremiah 7:9 in Telugu 9 మీరు వ్యభిచారం, దొంగతనం, నరహత్యలు,
Jeremiah 10:24 in Telugu 24 యెహోవా, నన్ను నీ న్యాయవిధిని బట్టి క్రమశిక్షణలో పెట్టు. అలా కాక నీ కోపాన్ని బట్టి శిక్షించావంటే నేను నాశనమైపోతాను.
Jeremiah 16:18 in Telugu 18 వాళ్ళు తమ నీచమైన విగ్రహాలతో నా సొత్తు నింపారు. నా దేశాన్ని అపవిత్రపరచారు. కాబట్టి నేను మొదట వారి దోషాన్ని బట్టి, వారి పాపాన్ని బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారం చేస్తాను.”
Jeremiah 32:34 in Telugu 34 తరువాత వాళ్ళు నా పేరు పెట్టిన మందిరాన్ని అపవిత్రం చెయ్యడానికి దానిలో హేయమైన వాటిని పెట్టారు.
Jeremiah 44:4 in Telugu 4 అందుకని నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ పదే పదే పంపిస్తూ వచ్చాను. నేను అసహ్యించుకునే ఈ నీచమైన పనులు చేయవద్దు అని చెప్పేందుకు వాళ్ళని పంపాను.
Lamentations 2:21 in Telugu 21 యువకులూ, వృద్ధులూ వీధుల్లో నేల మీద పడి ఉన్నారు. నా కన్యకలూ, నా యోధులూ కత్తి చేత కూలి పోయారు. నీ ఉగ్రత దినాన నువ్వు వాళ్ళను హతం చేశావు. జాలి లేకుండా వాళ్ళందరినీ నువ్వు చంపావు.
Ezekiel 7:4 in Telugu 4 నా దృష్టిలో మీ పట్ల ఎలాంటి కనికరమూ చూపను. నేనే యెహోవాను అని మీకు తెలిసే విధంగా నీచమైన వాటిని మీ మధ్యే ఉండనిస్తాను!
Ezekiel 7:9 in Telugu 9 నాకు మీ పట్ల కనికరం లేదు. నేను మిమ్మల్ని వదలను. మీరు చేసినట్టే నేనూ మీకు చేస్తాను. మిమ్మల్ని శిక్షించే యెహోవాను నేనే అని మీకు తెలిసే విధంగా నీచమైన వాటిని మీ మధ్యే ఉండనిస్తాను!
Ezekiel 7:20 in Telugu 20 వాళ్ళు అహంకరించి రత్నభరితమైన ఆభరణాలు చేయించారు. అవి వాళ్ళ నీచమైన పనులను వర్ణించే విగ్రహ ఆకారాలుగా ఏర్పడ్డాయి. వాటితో వాళ్ళు అసహ్యకరమైన తమ పనులను సాగించారు. కాబట్టి ఆ ఆభరణాలు వాళ్లకి అసహ్యం పుట్టేలా నేను చేస్తాను.
Ezekiel 8:5 in Telugu 5 అప్పుడు ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, ఉత్తరం వైపుకి శ్రద్ధగా చూడు.” ద్వారానికి ఉత్తరం వైపు దారి బలిపీఠానికి దారి తీస్తుంది. అక్కడే రోషం కలిగించే విగ్రహం ఉంది. నేను ఆ వైపుకి తదేకంగా చూశాను. నాకు ఆ విగ్రహం కనిపించింది.
Ezekiel 8:16 in Telugu 16 ఇలా చెప్పి ఆయన యెహోవా మందిరం లోపలి ఆవరణలో నన్ను దించాడు. అక్కడ చూస్తే, మందిర ద్వారం దగ్గర మంటపానికీ బలిపీఠానికీ మధ్యలో ఇరవై ఐదు మంది పురుషులు ఉన్నారు. వారు తూర్పు వైపుకి తిరిగి ఉన్నారు. వాళ్ళ వీపులు వెనుక యెహోవా మందిరం వైపుకీ, ముఖాలు తూర్పు వైపుకీ ఉన్నాయి. వాళ్ళు తూర్పున ఉన్న సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు.
Ezekiel 8:18 in Telugu 18 కాబట్టి నేను వాళ్ళ మధ్య నా పని జరిగిస్తాను. నా దృష్టిలో వాళ్ళ పట్ల నాకెలాంటి కనికరమూ ఉండదు. నేను వాళ్ళని వదలను. వాళ్ళు నా చెవిలో ఎంత పెద్ద స్వరంతో ఏడ్చినా నేను వినను.”
Ezekiel 9:5 in Telugu 5 అప్పుడు నేను వింటూ ఉండగా ఆయన మిగిలిన వాళ్ళకి ఇలా అజ్ఞాపించాడు. “మీరు అతని వెనకే పట్టణంలో సంచరించండి. హతమార్చండి! ఎలాంటి కనికరమూ లేకుండా అందరినీ చంపండి.
Ezekiel 9:10 in Telugu 10 కాబట్టి నా దృష్టిలో వారి కోసం ఎలాంటి కనికరమూ లేదు. నేను వాళ్ళని వదలను. వీటన్నిటి ఫలితాన్ని వాళ్ళ తలల పైకి తెస్తాను.”
Ezekiel 11:18 in Telugu 18 వారు అక్కడికి తిరిగి వస్తారు. వాళ్ళు ప్రతి అసహ్యమైన దాన్నీ నీచమైన దాన్నీ అక్కడనుండి తీసివేస్తారు.
Ezekiel 11:21 in Telugu 21 అయితే అసహ్యమైన వాటిపట్ల, నీచమైన వాటిపట్ల అనురక్తితో నడిచే వాళ్ళ విషయంలో వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని వాళ్ళు అనుభవించేలా చేస్తాను.” ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.
Ezekiel 23:28 in Telugu 28 ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, చూడు! నువ్వు ద్వేషించిన వాళ్ళకూ, నీ మనస్సు దూరమైన వాళ్ళకూ నిన్ను అప్పగిస్తున్నాను.
Ezekiel 24:14 in Telugu 14 యెహోవానైన నేను ప్రకటించాను. అది జరుగుతుంది. నేనే దాన్ని నెరవేరుస్తాను. నేను వెనుకాడను, కనికరించను. నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలనుబట్టి నీకు శిక్ష ఉంటుంది. ఇదే యెహోవా వాక్కు.”
Ezekiel 29:15 in Telugu 15 రాజ్యాల్లో అది అల్పమైన రాజ్యంగా ఉంటుంది. ఇక ఇతర రాజ్యాల మీద అతిశయపడదు. వాళ్ళిక ఇతర రాజ్యాలపై పెత్తనం చేయకుండా నేను వారిని తగ్గిస్తాను.
Ezekiel 44:7 in Telugu 7 మీరు నాకు ఆహారం, కొవ్వు, రక్తం, అర్పించే సమయాల్లో హృదయంలో శరీరంలో సున్నతి లేని అన్యులను నా పరిశుద్ధ స్థలంలోకి తీసుకువచ్చారు. వారు మీ అకృత్యాలను ఆధారం చేసుకుని దాన్ని అపవిత్రపరచి నా నిబంధనను భంగపరిచారు.
Amos 8:7 in Telugu 7 యాకోబు అతిశయాస్పదం తోడని యెహోవా ఇలా ప్రమాణం చేశాడు. “వారు చేసిన పనుల్లో దేన్నీ నేను మరచిపోను.”
Zechariah 11:6 in Telugu 6 ఇదే యెహోవా వాక్కు. “ఇకపై నేను ఈ దేశనివాసులపై కనికరం చూపించను. ఒకరి చేతికి ఒకరిని వశపరుస్తాను. వాళ్ళ రాజుల చేతికి వాళ్ళందరినీ అప్పగిస్తాను. ఆ రాజులు దేశాన్ని నాశనం చేసినప్పుడు వాళ్ళ చేతిలోనుండి నేనెవరినీ విడిపించను.”
Malachi 3:17 in Telugu 17 “నేను నియమించే రోజు సమీపించినప్పుడు వారు నావారుగా, నా ప్రత్యేక సొత్తుగా ఉంటారు. తండ్రి తనను సేవించే కొడుకును కనికరించే విధంగా నేను వారిని కనికరిస్తాను” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.
Romans 8:32 in Telugu 32 తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా?
Romans 11:12 in Telugu 12 వారి అపరాధం లోకానికి, వారి నష్టం యూదేతరులకు ఐశ్వర్యంగా ఉంటే, వారి పరిపూర్ణత ఇంకెంత ఎక్కువ ఐశ్వర్యకరమౌతుందో!
Romans 11:21 in Telugu 21 ఎందుకంటే దేవుడు సహజమైన కొమ్మలనే వదల్లేదంటే నిన్ను కూడా వదలడు గదా!
Hebrews 6:13 in Telugu 13 దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు, ఆయన కంటే గొప్పవాడు ఎవడూ లేడు కాబట్టి, “నా తోడు” అంటూ ప్రమాణం చేశాడు.
2 Peter 2:4 in Telugu 4 పూర్వం పాపం చేసిన దేవదూతలను కూడా విడిచిపెట్టకుండా దేవుడు వారిని సంకెళ్లకు అప్పగించి దట్టమైన చీకటిలో తీర్పు వరకూ ఉంచాడు.