Ezekiel 37:26 in Telugu 26 నేను వాళ్ళతో శాంతి ఒడంబడిక చేస్తాను. అది వాళ్ళతో నా నిత్య నిబంధనగా ఉంటుంది. వాళ్ళ సంఖ్య పెరిగేలా చేస్తాను. వాళ్ళ మధ్య నా పవిత్ర స్థలాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తాను.
Other Translations King James Version (KJV) Moreover I will make a covenant of peace with them; it shall be an everlasting covenant with them: and I will place them, and multiply them, and will set my sanctuary in the midst of them for evermore.
American Standard Version (ASV) Moreover I will make a covenant of peace with them; it shall be an everlasting covenant with them; and I will place them, and multiply them, and will set my sanctuary in the midst of them for evermore.
Bible in Basic English (BBE) And I will make an agreement of peace with them: it will be an eternal agreement with them: and I will have mercy on them and make their numbers great, and will put my holy place among them for ever.
Darby English Bible (DBY) And I will make a covenant of peace with them: it shall be an everlasting covenant with them; and I will place them, and multiply them, and will set my sanctuary in the midst of them for ever.
World English Bible (WEB) Moreover I will make a covenant of peace with them; it shall be an everlasting covenant with them; and I will place them, and multiply them, and will set my sanctuary in the midst of them forevermore.
Young's Literal Translation (YLT) And I have made to them a covenant of peace, A covenant age-during it is with them, And I have placed them, and multiplied them, And placed My sanctuary in their midst -- to the age.
Cross Reference Genesis 17:7 in Telugu 7 నేను నీకూ నీ తరువాత నీ సంతానానికీ దేవుడిగా ఉండే విధంగా నాకూ నీకూ మధ్యన, నీ తరువాత నాకూ నీ సంతానానికీ మధ్యన నా నిబంధనను స్థిరం చేస్తాను. అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది.
Leviticus 26:11 in Telugu 11 నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను. మీ విషయం నా మనస్సు అసహ్యపడదు.
2 Samuel 23:5 in Telugu 5 నా సంతానం దేవుని ఎదుట అలాటి వారు కాకపోయినా ఆయన నాతో నిత్య నిబంధన చేయలేదా? ఆ నిబంధన అన్నివిధాలా సంపూర్ణమైనది, సుస్థిరమైనది కాదా? ఆయన నాకు ధారాళమైన రక్షణ చేకూర్చి, అంతా సఫలమయ్యేలా చేస్తాడు.
1 Kings 8:20 in Telugu 20 ఆయన చెప్పిన మాట యెహోవా నెరవేర్చాడు. నేను నా తండ్రి అయిన దావీదు స్థానంలో నియామకం పొంది, యెహోవా వాగ్దానం ప్రకారం ఇశ్రాయేలీయుల మీద రాజునై, వారి దేవుడు యెహోవా నామ ఘనత కోసం మందిరాన్ని కట్టించాను.
Psalm 68:18 in Telugu 18 నీవు ఆరోహణమైపోయావు. బందీలను చెరపట్టుకుపోయావు. మనుషుల నుండి నువ్వు కానుకలు తీసుకున్నావు. యెహోవా, నువ్వు అక్కడ నివసించేలా నీపై తిరుగుబాటు చేసిన వారి నుండి కూడా నువ్వు కానుకలు తీసుకున్నావు.
Psalm 89:3 in Telugu 3 నేను ఏర్పరచుకున్న వాడితో ఒడంబడిక చేసుకున్నాను. నా సేవకుడు దావీదుతో ప్రమాణం చేశాను.
Isaiah 27:6 in Telugu 6 రాబోయే ఆ రోజున యాకోబు వేరు వ్యాపిస్తుంది. ఇశ్రాయేలు జాతి మొగ్గ వేసి పుష్పిస్తుంది. వాళ్ళు భూమినంతా ఫలభరితం చేస్తారు.
Isaiah 49:21 in Telugu 21 అప్పుడు నువ్వు ఇలా అనుకుంటావు, ఈ పిల్లలను నా కోసం ఎవరు కన్నారు? నేను నా పిల్లలను కోల్పోయి ఏడ్చాను. గొడ్రాలిని, బందీని అయ్యాను. ఈ పిల్లలను ఎవరు పెంచారు? నేను ఏకాకినయ్యాను. వీళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు?”
Isaiah 55:3 in Telugu 3 శ్రద్ధగా విని నా దగ్గరికి రండి! మీరు వింటే బతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపించిన శాశ్వతకృపను మీకు చూపిస్తాను.
Isaiah 59:20 in Telugu 20 “విమోచకుడు సీయోను వస్తాడు. యాకోబు వంశంలో తిరుగుబాటు చేయడం మానిన వారి దగ్గరికి విమోచకుడు వస్తాడు.” ఇదే యెహోవా వాక్కు.
Jeremiah 30:19 in Telugu 19 అప్పుడు వాటిలోనుంచి ఒక స్తుతి కీర్తన, ఒక వేడుక శబ్దం బయటకు వస్తుంది. ప్రజలు తక్కువ సంఖ్యలో లేకుండా నేను వాళ్ళను విస్తరింపజేస్తాను. అల్పులు కాకుండా నేను వాళ్ళకు ఘనత కలుగజేస్తాను.
Jeremiah 31:27 in Telugu 27 ఇది యెహోవా వాక్కు. “చూడు, ఇశ్రాయేలు గృహాల్లో, యూదా గృహాల్లో మనుషుల, మృగాల సంతానపు విత్తనాలు చల్లే రోజులు వస్తున్నాయి.
Jeremiah 32:40 in Telugu 40 నేను వాళ్ళ నుంచి తిరిగిపోకుండా ఉండేలా వాళ్లతో ఒక నిత్యమైన నిబంధన స్థిరం చేస్తాను. వాళ్లకు మేలు చేసేందుకు, వాళ్ళు నన్ను వెంబడించడం విడిచిపెట్టకుండా ఉండేలా వాళ్ళ హృదయాల్లో నా పట్ల గౌరవం కలిగిస్తాను.
Ezekiel 11:16 in Telugu 16 కాబట్టి వాళ్ళకి ఇలా చెప్పు. “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, దూరంగా ఉన్న జాతుల్లోకి నేను వారిని తొలగించినా, ఇతర దేశాల్లోకి వాళ్ళని నేను చెదరగొట్టినా వాళ్ళు చెదరిపోయిన దేశాల్లో నేను వారికి కొంతకాలం పరిశుద్ద ఆలయంగా ఉంటాను”
Ezekiel 16:62 in Telugu 62 నేను నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు!
Ezekiel 34:25 in Telugu 25 అవి అరణ్యంలో నిర్భయంగా నివసించేలా, అడవిలో క్షేమంగా పడుకునేలా నేను వాటితో శాంతి ఒడంబడిక చేస్తాను. దేశంలో క్రూర జంతువులు లేకుండా చేస్తాను.
Ezekiel 36:10 in Telugu 10 మీ మీద ఎంతోమందిని, అంటే ఇశ్రాయేలీయులను విస్తరింప చేస్తాను. పట్టణాల్లో ప్రజలు నివసిస్తారు. శిథిలాలను మళ్ళీ కట్టడం జరుగుతుంది.
Ezekiel 36:37 in Telugu 37 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే “తమ కోసం ఇలా చేయమని ఇశ్రాయేలీయులు నన్ను అడిగేలా చేస్తాను. గొర్రెల మందల్లాగా నేను వారిని విస్తరింపజేస్తాను.
Ezekiel 43:7 in Telugu 7 “నరపుత్రుడా, ఇది నా సింహాసన స్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య ఎల్లప్పుడూ నివసిస్తాను. ఇకమీదట వారు తమ అపనమ్మకత్వం వలనా తమ రాజుల కళేబరాలకు ఉన్నత స్థలాలను కట్టి పూజలు చేయడం వలనా వారు గాని, వారి రాజులు గాని నా పవిత్రమైన పేరును అపవిత్రం చేయరు.
Ezekiel 45:1 in Telugu 1 “మీరు చీట్లు వేసి దేశాన్ని పంచుకునేటప్పుడు భూమిలో ఒక భాగాన్ని యెహోవాకు అర్పణగా ప్రతిష్ఠించాలి. అది 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల 800 మీటర్ల వెడల్పు ఉండాలి. ఈ సరిహద్దుల్లో ఉన్న భూమి ప్రతిష్ఠితమౌతుంది.
Hosea 2:18 in Telugu 18 “ఆ దినాన నేను నా ప్రజల పక్షంగా జంతువులతో, పక్షులతో, నేలపై పాకే జీవులతో నిబంధన చేస్తాను. దేశంలో విల్లును, కత్తిని, యుద్ధాన్ని లేకుండా చేస్తాను. వారు నిర్భయంగా పడుకునేలా చేస్తాను.
Zechariah 2:5 in Telugu 5 యెహోవా చెప్పేది ఏమిటంటే, నేనే దాని చుట్టూ అగ్నికీలలతో సరిహద్దుగా ఉంటాను. నేను ఆ పట్టణం మధ్య నివసిస్తూ దానికి మహిమ కలిగిస్తాను.
Zechariah 8:4 in Telugu 4 సేనల ప్రభువు యెహోవా సెలవిచ్చేదేమంటే వృద్ధాప్యం వల్ల కర్ర పట్టుకుని, వృద్ధ స్త్రీపురుషులూ ఇంకా యెరూషలేము వీధుల్లో కూర్చుంటారు.
John 14:27 in Telugu 27 శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి.
2 Corinthians 6:16 in Telugu 16 దేవుని ఆలయానికి విగ్రహాలతో సంబంధం ఏమిటి? మనం జీవం గల దేవుని ఆలయం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. “నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడుగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.”
Hebrews 6:14 in Telugu 14 “నిన్ను కచ్చితంగా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని విస్తారం చేస్తాను” అన్నాడు.
Hebrews 13:20 in Telugu 20 గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్య నిబంధన రక్తాన్ని బట్టి చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేపిన శాంతి ప్రదాత అయిన దేవుడు