Ezekiel 3:17 in Telugu 17 “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలకు నిన్ను కాపలా వాడిగా పెట్టాను. కాబట్టి నా నోటి మాట జాగ్రత్తగా విను. వాళ్లకి నా హెచ్చరిక తెలియచెయ్యి!
Other Translations King James Version (KJV) Son of man, I have made thee a watchman unto the house of Israel: therefore hear the word at my mouth, and give them warning from me.
American Standard Version (ASV) Son of man, I have made thee a watchman unto the house of Israel: therefore hear the word at my mouth, and give them warning from me.
Bible in Basic English (BBE) Son of man, I have made you a watchman for the children of Israel: so give ear to the word of my mouth, and give them word from me of their danger.
Darby English Bible (DBY) Son of man, I have appointed thee a watchman unto the house of Israel, and thou shalt hear the word from my mouth, and give them warning from me.
World English Bible (WEB) Son of man, I have made you a watchman to the house of Israel: therefore hear the word at my mouth, and give them warning from me.
Young's Literal Translation (YLT) that there is a word of Jehovah unto me, saying, `Son of man, a watchman I have given thee to the house of Israel, and thou hast heard from My mouth a word, and hast warned them from Me.
Cross Reference 2 Chronicles 19:10 in Telugu 10 నరహత్య గురించి, ధర్మశాస్త్రం గురించి, ధర్మం గురించి, కట్టడలను గురించి న్యాయవిధులను గురించి, వివిధ పట్టణాల్లో నివసించే మీ సోదరులు తీసుకొచ్చే ఏ విషయమైనా మీరు విచారించేటప్పుడు మీమీదికీ మీ సోదరుల మీదికీ యెహోవా కోపం రాకుండా వారు యెహోవా దృష్టిలో ఏ పాపం చేయకుండా వారిని హెచ్చరించాలి. ఇలా చేస్తే మీరు అపరాధులు కాకుండా ఉంటారు.
Song of Solomon 3:3 in Telugu 3 పట్టణంలో గస్తీ తిరిగేవాళ్ళు నాకెదురు పడ్డారు. “మీరు నా ప్రాణప్రియుని చూశారా?” అని అడిగాను.
Song of Solomon 5:7 in Telugu 7 పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకు ఎదురుపడ్డారు. వాళ్ళు నన్ను కొట్టి గాయపర్చారు. ప్రాకారం మీద ఉన్న కావలివారు నా పైట చెంగు లాగేసుకున్నారు.
Isaiah 21:6 in Telugu 6 ఎందుకంటే ప్రభువు నాకు చెప్పిన మాట ఇది. వెళ్ళు. ఒక కాపలా వాణ్ణి నియమించు. తాను చూస్తున్న దాని గూర్చి అతడు సమాచారం ఇవ్వాలి.
Isaiah 21:8 in Telugu 8 ఆ కాపలా వాడు ఇలా అరుస్తాడు. “నా ప్రభూ, ఈ పహారా స్తంభంపై ప్రతి రోజూ, రోజంతా నిలబడి ఉన్నాను. రాత్రంతా నేను కాపలా కాస్తూనే ఉన్నాను.”
Isaiah 21:11 in Telugu 11 దూమా గూర్చిన ఒక దైవ ప్రకటన. శేయీరులో నుండి ఒకడు నన్ను అడుగుతున్నాడు. “కావలివాడా, రాత్రి ఇంకా ఎంత మిగిలి ఉంది? కావలివాడా, రాత్రి ఇంకా ఎంత మిగిలి ఉంది?”
Isaiah 52:8 in Telugu 8 విను! నీ కావలివారు తమ గొంతు పెంచుతున్నారు. వాళ్ళంతా కలిసి సంతోషంతో కేకలు వేస్తున్నారు. యెహోవా సీయోనుకు తిరిగి వచ్చేటప్పుడు వారు కళ్ళారా చూస్తారు.
Isaiah 56:10 in Telugu 10 వారి కాపలాదారులంతా గుడ్డివాళ్ళు. వాళ్ళంతా తెలివితక్కువ వాళ్ళు. వాళ్ళంతా మొరగలేని మూగకుక్కలు. పడుకుని కలలు కంటారు. నిద్ర అంటే వారికి చాలా ఇష్టం.
Isaiah 58:1 in Telugu 1 పెద్దగా కేకలు వెయ్యి. ఆపవద్దు. బూరలాగా నీ గొంతెత్తు. వారు చేసిన తిరుగుబాటు నా ప్రజలకు తెలియజెయ్యి. యాకోబు ఇంటివారికి వారి పాపాలను తెలియజెయ్యి.
Isaiah 62:6 in Telugu 6 యెరూషలేమా, నీ గోడలమీద నేను కావలి వారిని ఉంచాను. రాత్రి పగలూ వారు మౌనంగా ఉండరు. యెహోవాకు గుర్తుచేస్తూ ఉండే మీరు విరామం తీసుకోవద్దు.
Jeremiah 6:10 in Telugu 10 నేనెవరితో మాట్లాడి హెచ్చరించాలి? వారు వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వినలేదు. ఇదిగో, యెహోవా వాక్యం వారిని సరిదిద్దడానికి వారి దగ్గరికి వచ్చింది కానీ దాన్ని వారు తృణీకరిస్తారు.
Jeremiah 6:17 in Telugu 17 మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండడానికి నేను కావలి వారిని ఉంచాను. అదిగో, వారు చేసే బూరధ్వని వినండి.
Jeremiah 31:6 in Telugu 6 ఎఫ్రాయిము పర్వతాల మీద కాపలావాళ్ళు ‘మన దేవుడైన యెహోవా దగ్గరికి, సీయోనుకు ఎక్కి వెళ్దాం రండి’ అని ప్రకటించే రోజు ఒకటి రాబోతుంది.”
Ezekiel 33:2 in Telugu 2 “నరపుత్రుడా, నువ్వు నీ ప్రజలకు ఈ విషయం చెప్పు, నేను ఒకానొక దేశం మీదికి కత్తి రప్పిస్తే ఆ ప్రజలు తమలో ఒకణ్ణి ఎన్నుకుని కావలివానిగా ఏర్పరచుకున్నారనుకో.
Habakkuk 2:1 in Telugu 1 ఆయన నాకు ఏమి సెలవిస్తాడో, నా వాదం విషయమై నేనేమి చెబుతానో చూడడానికి నేను నా కావలి స్థలంపైనా గోపురంపైనా కనిపెట్టుకుని ఉంటాననుకున్నాను.
Matthew 3:7 in Telugu 7 చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి అతడు, “విషసర్పాల పిల్లలారా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
Acts 20:28 in Telugu 28 “ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడం కోసం పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా నియమించాడో ఆ మంద అంతటిని గురించీ, మీ మట్టుకు మిమ్మల్ని గురించీ జాగ్రత్తగా ఉండండి.
1 Corinthians 4:14 in Telugu 14 నేను ఈ మాటలు రాస్తున్నది మీరు నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పడానికే గానీ మిమ్మల్ని సిగ్గు పరచాలని కాదు.
1 Corinthians 12:28 in Telugu 28 దేవుడు సంఘంలో మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో ఉపదేశకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు.
2 Corinthians 5:11 in Telugu 11 కాబట్టి మేము ప్రభువు పట్ల భయభక్తులతో ప్రజలను ఒప్పిస్తున్నాము. మేమేంటో దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. మీ మనస్సాక్షికి కూడా అది స్పష్టంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము.
2 Corinthians 5:20 in Telugu 20 కాబట్టి మేము క్రీస్తు ప్రతినిధులం. దేవుడే మా ద్వారా మిమ్మల్ని బతిమాలుకొంటున్నట్టుంది. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాం.
Colossians 1:28 in Telugu 28 మేము ప్రకటిస్తున్నది ఈయననే. ప్రతి వ్యక్తినీ క్రీస్తులో పరిపూర్ణుడిగా చేసి దేవుని ముందు నిలబెట్టాలి. ఈ ఉద్దేశంతోనే మేము సమస్త జ్ఞానంతో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నాం బోధిస్తున్నాం.
1 Thessalonians 5:14 in Telugu 14 సోదరులారా, మీకు మా ఉపదేశం ఏమిటంటే, సోమరులను హెచ్చరించండి. ధైర్యం లేక కుంగిపోయిన వారికి ధైర్యం చెప్పండి. బలహీనులకు సహాయం చేయండి. అందరి పట్లా సహనం కలిగి ఉండండి.
Hebrews 13:17 in Telugu 17 మీ నాయకులకు విధేయులుగా ఉండండి. వారికి లోబడి ఉండండి. ఎందుకంటే వారు లెక్క అప్పజెప్పే వారిలా మీ ఆత్మల క్షేమం కోసం కావలివారుగా ఉన్నారు. మీ గురించి వారు విచారంతో కాకుండా సంతోషంగా కావలి కాసేవారుగా ఉండడానికి వారికి లోబడండి. వారు విచారంగా ఉండడం మీకు మేలుకరం కాదు.