Ezekiel 2:1 in Telugu 1 ఆ స్వరం నాతో ఇలా చెప్పింది. “నరపుత్రుడా, నీవు లేచి నీ కాళ్ళపై నిలబడు. నేను నీతో మాట్లాడుతాను.”
Other Translations King James Version (KJV) And he said unto me, Son of man, stand upon thy feet, and I will speak unto thee.
American Standard Version (ASV) And he said unto me, Son of man, stand upon thy feet, and I will speak with thee.
Bible in Basic English (BBE) And he said to me, Son of man, get up on your feet, so that I may say words to you.
Darby English Bible (DBY) And he said unto me, Son of man, stand upon thy feet, and I will speak with thee.
World English Bible (WEB) He said to me, Son of man, stand on your feet, and I will speak with you.
Young's Literal Translation (YLT) It `is' the appearance of the likeness of the honour of Jehovah, and I see, and fall on my face, and I hear a voice speaking, and He saith unto me, `Son of man, stand on thy feet, and I speak with thee.'
Cross Reference Psalm 8:4 in Telugu 4 నువ్వు పట్టించుకోవడానికి మానవజాతి ఏ పాటిది? నువ్వు మానవాళి పట్ల శ్రద్ధ చూపడానికి వారు ఎంతటివాళ్ళు?
Ezekiel 1:28 in Telugu 28 అది వర్షం కురిసినప్పుడు మబ్బుల్లో కనిపించే మేఘధనస్సులా, దాని చుట్టూ ఉండే ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది. అది యెహోవా మహిమలా కనిపించింది. అది చూసి నేను సాగిలపడ్డాను. అప్పుడు ఒక స్వరం నాతో మాట్లాడటం నేను విన్నాను.
Ezekiel 2:3 in Telugu 3 ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనాల దగ్గరకీ, ఇశ్రాయేలు ప్రజల దగ్గరకీ నిన్ను పంపిస్తున్నాను. వాళ్ళ పితరులూ, వాళ్ళూ ఈ రోజు వరకూ నాకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు.
Ezekiel 2:6 in Telugu 6 నరపుత్రుడా, నువ్వు వాళ్ళ మాటలకి గానీ, వాళ్లకి గానీ భయపడకు. నీ చుట్టూ ముళ్ళ చెట్లూ, బ్రహ్మజెముడు పొదలూ ఉన్నా, నువ్వు తేళ్ళ మధ్య నివాసం చేస్తున్నా భయపడకు. వాళ్ళు తిరుగుబాటు చేసే జాతి. అయినా వాళ్ళ మాటలకు భయపడకు. వాళ్ళ ముఖాలు చూసి వ్యాకుల పడకు.
Ezekiel 2:8 in Telugu 8 నరపుత్రుడా, నువ్వు అయితే నేను చెప్తున్నది విను. ఆ తిరగబడే జాతిలా నువ్వూ తిరుగుబాటు చేయకు. నేను నీకు ఇవ్వబోతున్న దాన్ని నోరు తెరచి తిను.”
Ezekiel 3:1 in Telugu 1 ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నీకు కనిపించిన దాన్ని తిను! ఈ పత్రాన్ని తిను. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళతో మాట్లాడు”
Ezekiel 3:4 in Telugu 4 అప్పుడు ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి నా మాటలు వారికి చెప్పు.
Ezekiel 3:10 in Telugu 10 తరువాత ఆయన నాకు ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నేను నీకు చెప్పే మాటలను చెవులారా విను. వాటిని నీ మనసులో ఉంచుకో.
Ezekiel 3:17 in Telugu 17 “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలకు నిన్ను కాపలా వాడిగా పెట్టాను. కాబట్టి నా నోటి మాట జాగ్రత్తగా విను. వాళ్లకి నా హెచ్చరిక తెలియచెయ్యి!
Ezekiel 4:1 in Telugu 1 అయితే నరపుత్రుడా, ఒక పెంకు తీసుకో. దాన్ని నీముఖానికి ఎదురుగా ఉంచుకో. దాని పైన యెరూషలేము పట్టణం నమూనాను చిత్రించు.
Ezekiel 5:1 in Telugu 1 “తరువాత నరపుత్రుడా, నువ్వు నీ కోసం మంగలి కత్తి లాంటి ఒక పదునైన కత్తి తీసుకో. దాంతో నీ తలను, గడ్డాన్నీ క్షౌరం చేసుకో. ఆ వెంట్రుకలను తూచడానికీ, భాగాలు చేయడానికీ ఒక త్రాసు తీసుకో.
Ezekiel 7:2 in Telugu 2 “నరపుత్రుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశానికిలా ప్రకటిస్తున్నాడు. అంతం! దేశం నాలుగు సరిహద్దులకు అంతం వచ్చేసింది.
Ezekiel 12:3 in Telugu 3 నరపుత్రుడా, నువ్వైతే దేశాంతరం వెళ్ళడానికి సామాను సిద్ధం చేసుకో. పగలు వాళ్ళు చూస్తుండగానే నువ్వు నీ స్థలాన్ని విడిచి ప్రయాణమై వేరే స్థలానికి దేశాంతరం పోవాలి. వాళ్ళు తిరగబడే వాళ్ళే అయినా ఇదంతా గమనించడం మొదలు పెడతారేమో.
Ezekiel 13:2 in Telugu 2 “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజల మధ్య ప్రవచనం చెప్తున్న ప్రవక్తలకు విరోధంగా ప్రవచించు. తమ సొంత ఆలోచనలను ప్రవచనాలుగా చెప్తున్న వాళ్ళకి ఇలా చెప్పు. యెహోవా మాట వినండి!
Ezekiel 14:3 in Telugu 3 “నరపుత్రుడా, ఈ మనుషులు విగ్రహాలను తమ హృదయాల్లో ప్రతిష్టించుకున్నారు. తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకున్నారు. వీళ్ళని నా దగ్గర విచారణ చేయనియ్యాలా?
Ezekiel 14:13 in Telugu 13 “నరపుత్రుడా, ఒక దేశం నాకు విరోధంగా పాపం చేసినప్పుడు నేను దాన్ని శిక్షించడానికి నా హస్తం చాపి దాని ఆహార వనరులను నాశనం చేసి, దానిపై కరువు పంపి, దేశంలో మనుషులనూ పశువులనూ నిర్మూలం చేస్తాను.
Ezekiel 15:2 in Telugu 2 “నరపుత్రుడా, ద్రాక్షచెట్టు కర్ర అడవిలోని ఇతర చెట్ల కర్రల కంటే ఏ విషయంలో గొప్పది?
Ezekiel 16:2 in Telugu 2 “నరపుత్రుడా, యెరూషలేము చేసిన అసహ్యమైన పనులు దానికి తెలియజేసి, నువ్వు ఇలా ప్రకటించు,
Ezekiel 17:2 in Telugu 2 “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక పొడుపు కథ వెయ్యి. ఒక ఉదాహరణ వారికి చెప్పు.
Ezekiel 20:3 in Telugu 3 “నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పెద్దలతో నువ్వు ఇలా చెప్పు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నన్ను అడిగి తెలుసుకోడానికి మీరు వచ్చారా? నా జీవం తోడు, నానుంచి ఏ ఆలోచనా మీకు దొరకదు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Ezekiel 37:3 in Telugu 3 ఆయన “నరపుత్రుడా, ఎండిపోయిన యీ ఎముకలు బతుకుతాయా?” అని నన్నడిగితే “ప్రభూ, యెహోవా, అది నీకే తెలుసు” అన్నాను.
Daniel 8:17 in Telugu 17 అప్పుడతడు నేను నిలబడి ఉన్న చోటుకు వచ్చాడు. అతడు రాగానే నేను హడలిపోయి సాష్టాంగపడ్డాను. అతడు “నర పుత్రుడా, ఈ దర్శనం అంత్యకాలాన్ని గురించినది అని తెలుసుకో” అన్నాడు.
Daniel 10:11 in Telugu 11 “దానియేలూ, నువ్వు చాలా ఇష్టమైన వాడివి గనక నేను నీ దగ్గరికి పంపబడ్డాను. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పే మాటలు తెలుసుకో” అన్నాడు. అతడీ మాటలు నాతో చెప్పగా నేను వణకుతూ నిలబడ్డాను.
Daniel 10:19 in Telugu 19 నీకు శుభం కలుగుతుంది. ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకో” అని నాతో అన్నాడు. అతడు నాతో ఇలా అన్నప్పుడు నేను ధైర్యం తెచ్చుకుని “నీవు నన్ను ధైర్యపరచావు గనక నా యజమానివైన నీవు ఆజ్ఞ ఇవ్వు” అని చెప్పాను.
Matthew 16:13 in Telugu 13 యేసు కైసరయ ఫిలిప్పీ ప్రాంతాలకు వచ్చినపుడు తన శిష్యులను ఇలా అడిగాడు, “మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు మాట్లాడుకుంటున్నారు?”
Matthew 17:7 in Telugu 7 యేసు వారి దగ్గరికి వచ్చి, వారిని తాకి, “భయపడకండి, ఇక లేవండి” అన్నాడు.
John 3:13 in Telugu 13 పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు ఎవడూ లేడు.
John 3:16 in Telugu 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు.
Acts 9:6 in Telugu 6 లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నీవేం చేయాలో అది నీకు తెలుస్తుంది” అని చెప్పాడు.
Acts 26:16 in Telugu 16 నీవు నన్ను చూసిన సంగతిని గురించీ, నీకు ఇకముందు వెల్లడి కాబోయే సంగతులను గురించీ నిన్ను నా పరిచారకునిగా, సాక్షిగా నియమించడానికే నీకు ప్రత్యక్షమయ్యాను. నీవు లేచి నిలబడు,