Ezekiel 19:12 in Telugu 12 కాని, అతికోపంతో ఆ ద్రాక్షవల్లిని పెకలించి నేల మీద పడేయడం జరిగింది. తూర్పుగాలి విసిరినప్పుడు దాని పళ్ళు ఎండిపోయాయి. దాని గట్టికొమ్మలు తెగి, వాడిపోయి, కాలిపోయాయి.
Other Translations King James Version (KJV) But she was plucked up in fury, she was cast down to the ground, and the east wind dried up her fruit: her strong rods were broken and withered; the fire consumed them.
American Standard Version (ASV) But it was plucked up in fury, it was cast down to the ground, and the east wind dried up its fruit: its strong rods were broken off and withered; the fire consumed them.
Bible in Basic English (BBE) But she was uprooted in burning wrath, and made low on the earth; the east wind came, drying her up, and her branches were broken off; her strong rod became dry, the fire made a meal of it.
Darby English Bible (DBY) But it was plucked up in fury, it was cast down to the ground, and the east wind dried up its fruit; its strong rods were broken and withered; the fire consumed them.
World English Bible (WEB) But it was plucked up in fury, it was cast down to the ground, and the east wind dried up its fruit: its strong rods were broken off and withered; the fire consumed them.
Young's Literal Translation (YLT) And it is plucked up in fury, To the earth it hath been cast, And the east wind hath dried up its fruit, Broken and withered hath been the rod of its strength, Fire hath consumed it.
Cross Reference Deuteronomy 32:22 in Telugu 22 నా కోపాగ్ని రగులుకుంది. పాతాళ అగాధం వరకూ అది మండుతుంది. భూమినీ దాని పంటనూ అది కాల్చేస్తుంది. పర్వతాల పునాదులను రగులబెడుతుంది.
2 Kings 23:29 in Telugu 29 అతని కాలంలో ఐగుప్తురాజు ఫరో నెకో అష్షూరురాజుతో యుద్ధం చెయ్యడానికి యూఫ్రటీసు నది దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు తనను యుద్ధంలో ఎదుర్కోడానికి వచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర చంపాడు.
2 Kings 23:34 in Telugu 34 యోషీయా కొడుకు ఎల్యాకీమును అతని తండ్రి యోషీయా స్థానంలో నియమించి, అతనికి యెహోయాకీము అని మారుపేరు పెట్టాడు. కాని అతడు యెహోయాహాజును ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళినప్పుడు అతడు అక్కడ చనిపోయాడు.
2 Kings 24:6 in Telugu 6 యెహోయాకీము తన పూర్వీకులతోబాటు చనిపోగా అతని కొడుకు యెహోయాకీను అతని స్థానంలో రాజయ్యాడు.
2 Kings 24:14 in Telugu 14 ఇంకా, అతడు దేశపు ప్రజల్లో అతి పేదవారు తప్ప ఇంక ఎవరూ లేకుండా యెరూషలేము పట్టణమంతట్లో ఉన్న అధిపతులూ, పరాక్రమవంతులూ పదివేలమందినీ, వీళ్ళు కాకుండా కంసాలివాళ్ళను, కమ్మరివాళ్ళను బందీలుగా తీసుకుపోయాడు.
2 Kings 25:6 in Telugu 6 వారు రాజును పట్టుకుని రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకుపోయారు. రాజు అతనికి శిక్ష విధించాడు.
Psalm 52:5 in Telugu 5 కాబట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు. ఆయన నిన్ను నీ గుడారంలో నుండి పెరికి వేస్తాడు. సజీవులుండే ప్రాంతం నుండి నిన్ను పెల్లగిస్తాడు.
Psalm 80:12 in Telugu 12 దారిన పోయేవాళ్ళంతా దాని పళ్ళు కోసేలా దాని కంచెలను నువ్వెందుకు పడగొట్టావు?
Psalm 80:16 in Telugu 16 దాన్ని నరికి కాల్చివేశారు, నీ గద్దింపుతో నీ శత్రువులు నశించుదురు గాక.
Psalm 89:40 in Telugu 40 అతని గోడలన్నీ నువ్వు పగలగొట్టావు. అతని కోటలను పాడుచేశావు.
Isaiah 5:5 in Telugu 5 ఆలోచించండి, నేను నా ద్రాక్షతోటకు చేయబోయే దాన్ని మీకు వివరిస్తాను. దాన్ని పశువులు మేసేలా దాని కంచెను కొట్టి వేస్తాను. అందరూ దాన్ని తొక్కేలా దాని గోడను పడగొట్టి పాడుచేస్తాను.
Isaiah 27:11 in Telugu 11 ఆ కొమ్మలు ఎండిపోయినప్పుడు విరిగిపడతాయి. స్త్రీలు వచ్చి వాటితో మంట పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ ప్రజలు జ్ఞానం ఉన్న వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ సృష్టికర్త వాళ్ళపై కనికరపడడు. వాళ్ళని చేసిన వాడు వాళ్ళపై దయ చూపించడు.
Jeremiah 4:11 in Telugu 11 ఆ రోజుల్లో ఆ ప్రజలకు యెరూషలేము నివాసుల గూర్చి ఇలా చెబుతారు. “ఎడారిలో చెట్లులేని మెరకల నుండి నా ప్రజల పైకి వడగాలి వీస్తున్నది. అది తూర్పార పట్టడానికో, శుద్ధి చేయడానికో కాదు.
Jeremiah 22:10 in Telugu 10 చనిపోయిన వాళ్ళను గురించి ఏడవవద్దు, వాళ్ళ గురించి అంగలార్చవద్దు. బందీలుగా వెళ్లిపోతున్నవాళ్ళ గురించి మీరు తప్పకుండా ఏడవాలి. ఎందుకంటే వాళ్ళు ఇక ఎన్నటికీ తిరిగిరారు. తమ జన్మభూమిని ఇక చూడరు.
Jeremiah 22:18 in Telugu 18 కాబట్టి యోషీయా కొడుకు యెహోయాకీము అనే యూదా రాజు గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు. “ప్రజలు, అయ్యో నా సోదరా! అయ్యో నా సోదరీ” అని అతని గురించి ఏడవరు. “అయ్యో, యజమానీ! అయ్యో, ఘనుడా” అని అతని కోసం ఏడవరు.
Jeremiah 22:25 in Telugu 25 నీ ప్రాణం తీయడానికి చూస్తున్న వారి చేతికి, నువ్వు భయపడుతున్న బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగిస్తాను.
Jeremiah 22:30 in Telugu 30 యెహోవా ఇలా చెబుతున్నాడు “సంతానం లేనివాడనీ తన రోజుల్లో అతడు వర్ధిల్లడనీ ఈ మనిషి గురించి రాయండి. అతని సంతానంలో ఎవడూ వర్ధిల్లడు, వారిలో ఎవడూ దావీదు సింహాసనం ఎక్కడు. ఇక మీదట ఎవడూ యూదాలో రాజుగా ఉండడు.”
Jeremiah 31:28 in Telugu 28 వాళ్ళను పెల్లగించడానికి, విరగగొట్టడానికి, పడద్రోయడానికి, నాశనం చెయ్యడానికి, హింసించడానికి, నేనెలా కనిపెట్టుకుని ఉన్నానో, అలాగే వాళ్ళను స్థాపించడానికి, నాటడానికి కనిపెట్టుకుని ఉంటాను.” ఇది యెహోవా వాక్కు.
Ezekiel 15:4 in Telugu 4 చూడండి! అది పొయ్యిలో పెట్టి కాల్చడానికే ఉపయోగపడుతుంది కదా! ఆ కర్ర రెండు వైపులా, మధ్యలోనూ పూర్తిగా కాలిన తరువాత ఇక దేనికి పనికి వస్తుంది?
Ezekiel 15:6 in Telugu 6 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. అడవిలోని ఇతర చెట్లవలే కాకుండా ద్రాక్ష చెట్టుని అగ్నికి ఇంధనంగా ఉపయోగించాను. ఇదే విధంగా నేను యెరూషలేములో నివసించే వారి విషయంలో చేస్తాను.
Ezekiel 17:10 in Telugu 10 ఒకవేళ దాన్ని తిరిగి నాటినా అది పెరుగుతుందా? తూర్పునుండి గాలి దాన్ని తాకినప్పుడు అది ఎండిపోతుంది కదా! అది నాటి ఉన్న భూమిలోనే మొత్తం ఎండిపోతుంది.”
Ezekiel 19:11 in Telugu 11 రాజులకు రాజదండాలు చెయ్యడానికి వీలైన బలమైన కొమ్మలు ఉండి, అవి మిగతా వాటికంటే ఎంతో ఎత్తుగా ఎదిగాయి.
Ezekiel 20:47 in Telugu 47 దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నీలో అగ్ని రగిలిస్తాను. అది నీలో ఉన్న పచ్చని పళ్ళ చెట్లన్నిటినీ, ఎండిన చెట్లన్నిటినీ కాల్చేస్తుంది. అది ఆరిపోదు. దక్షిణం మొదలుకుని ఉత్తరం వరకూ భూతలమంతా ఆ భీకరమైన అగ్ని దహిస్తుంది.
Ezekiel 28:17 in Telugu 17 నీ సౌందర్యాన్ని చూసుకుని గర్వించావు. నీ వైభవాన్ని చూసుకుని నీ తెలివి పాడుచేసుకున్నావు. అందుకే నేను నిన్ను భూమి మీద పడేశాను. రాజులు నిన్ను చూసేలా వాళ్ళ ఎదుట నిన్నుంచాను.
Hosea 13:15 in Telugu 15 ఎఫ్రాయిము తన సోదరుల్లో వర్థిల్లినా, తూర్పు గాలి వస్తుంది. యెహోవా పుట్టించే గాలి అరణ్యంలో నుండి లేస్తుంది. అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోతాయి. ఎఫ్రాయిము ఊటలు ఇంకిపోతాయి. అతని బావిలో నీరు ఉండదు. అతని శత్రువులు అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటిని కొల్లగొడతారు.
Matthew 3:10 in Telugu 10 ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు ఆనించి ఉంది. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో పడేస్తారు.
John 15:6 in Telugu 6 ఎవరైనా నాలో ఉండకపోతే, అతడు తీసి పారేసిన కొమ్మలా ఎండిపోతారు. వారు ఆ కొమ్మలను పోగుచేసి మంటలో వేస్తారు. అవి కాలిపోతాయి.