Ezekiel 12:2 in Telugu 2 “నరపుత్రుడా, నువ్వు తిరగబడే ప్రజల మధ్య నివసిస్తున్నావు. వాళ్లకు కళ్ళు ఉన్నాయి. కానీ వాళ్ళు చూడరు. వాళ్లకి చెవులు ఉన్నాయి. కానీ వినరు.
Other Translations King James Version (KJV) Son of man, thou dwellest in the midst of a rebellious house, which have eyes to see, and see not; they have ears to hear, and hear not: for they are a rebellious house.
American Standard Version (ASV) Son of man, thou dwellest in the midst of the rebellious house, that have eyes to see, and see not, that have ears to hear, and hear not; for they are a rebellious house.
Bible in Basic English (BBE) Son of man, you are living among an uncontrolled people, who have eyes to see but see not, and ears for hearing but they do not give ear; for they are an uncontrolled people.
Darby English Bible (DBY) Son of man, thou dwellest in the midst of a rebellious house, which have eyes to see, and see not, which have ears to hear, and hear not; for they are a rebellious house.
World English Bible (WEB) Son of man, you dwell in the midst of the rebellious house, who have eyes to see, and don't see, who have ears to hear, and don't hear; for they are a rebellious house.
Young's Literal Translation (YLT) `Son of man, in the midst of the rebellious house thou art dwelling, that have eyes to see, and they have not seen; ears they have to hear, and they have not heard; for a rebellious house `are' they.
Cross Reference Deuteronomy 9:7 in Telugu 7 ఎడారిలో మీరు మీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. దాన్ని మరచిపోవద్దు. మీరు ఐగుప్తు దేశంలో బయలుదేరిన రోజు నుండి ఈ ప్రాంతంలో మీరు ప్రవేశించేంత వరకూ మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.
Deuteronomy 9:24 in Telugu 24 నేను మిమ్మల్ని ఎరిగిన రోజు నుండీ మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.
Deuteronomy 29:4 in Telugu 4 అయినప్పటికీ గ్రహించే హృదయాన్నీ చూసే కళ్ళనూ వినే చెవులనూ ఇప్పటికీ యెహోవా మీకు ఇవ్వలేదు.
Deuteronomy 31:27 in Telugu 27 మీ తిరుగుబాటుతత్వం, మీ తలబిరుసుతనం నాకు తెలుసు. ఇవ్వాళ నేను ఇంకా జీవించి మీతో కలిసి ఉండగానే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేశారు.
Psalm 78:40 in Telugu 40 అరణ్యంలో వారు ఆయన మీద ఎన్నోసార్లు తిరగబడ్డారు. ఎడారిలో ఆయనను ఎన్నోసార్లు దుఃఖపెట్టారు.
Isaiah 1:23 in Telugu 23 నీ అధికారులు ద్రోహులు. వాళ్ళు దొంగలతో సావాసం చేస్తారు. అందరూ లంచం ఆశిస్తారు. చెల్లింపుల వెంటబడతారు. తండ్రి లేని వాళ్ళ పక్షంగా ఉండరు. వితంతువుల న్యాయమైన అభ్యర్ధన వాళ్ళు పట్టించుకోరు.
Isaiah 6:9 in Telugu 9 ఆయన “నీవు వెళ్లి ఈ ప్రజలతో చెప్పు. మీరు అస్తమానం వింటూ ఉంటారు గానీ గ్రహించరు. ఎప్పుడూ చూస్తుంటారు గానీ తెలుసుకోరు.
Isaiah 29:9 in Telugu 9 వేచి చూడండి! ఆశ్చర్యపొండి, నివ్వెరపొండి. మిమ్మల్ని మీరు గుడ్డివాళ్ళుగా చేసుకుని గుడ్డివాళ్ళు కండి. ద్రాక్షారసం తాగకుండానే మత్తెక్కిన వాళ్ళలా ఉండండి. మద్యం తీసుకోకుండానే తూలుతూ ఉండండి.
Isaiah 30:1 in Telugu 1 “తిరుగుబాటు చేసే పిల్లలకు బాధ.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “వాళ్ళు ఆలోచనలు చేస్తారు. కానీ నన్ను సంప్రదించరు. ఇతర జనాలతో స్నేహం చేస్తారు. కానీ నా ఆత్మ నిర్దేశించింది కాదు. ఈ విధంగా వాళ్ళు పాపానికి పాపాన్ని జోడిస్తారు.
Isaiah 30:9 in Telugu 9 వీళ్ళు తిరగబడే ప్రజలు. అబద్ధమాడే పిల్లల్లాంటి వాళ్ళు. యెహోవా ఆదేశాలను వినని పిల్లలు.
Isaiah 42:19 in Telugu 19 నా సేవకుడు తప్ప గుడ్డివాడు మరెవడు? నేను పంపిన నా దూత తప్ప చెవిటివాడు మరెవడు? నాతో నిబంధనలో ఉన్నవానికంటే, యెహోవా సేవకుని కంటే గుడ్డివాడు ఎవడు?
Isaiah 65:2 in Telugu 2 మూర్ఖంగా ఉండే ప్రజలకోసం రోజంతా నా చేతులు చాపాను. వాళ్ళు తమ ఆలోచనలననుసరిస్తూ చెడు దారిలో నడుస్తూ ఉన్నారు.
Jeremiah 4:17 in Telugu 17 యూదా నా మీద తిరుగుబాటు చేసింది కాబట్టి వారు పొలాన్ని కావలి కాసేవారిలాగా యూదాను కూడా ముట్టడిస్తారు. ఇదే యెహోవా వాక్కు.
Jeremiah 5:21 in Telugu 21 మీరు కళ్ళుండీ చూడడం లేదు, చెవులుండీ వినడం లేదు. మీరు తెలివి లేని మూర్ఖులు.
Jeremiah 5:23 in Telugu 23 ఈ ప్రజలు తిరుగుబాటు, ద్రోహం చేసే మనస్సు గలవారు, వారు పక్కకు తొలగిపోతున్నారు.
Jeremiah 9:1 in Telugu 1 నా తల జలమయంగా నా కళ్ళు కన్నీటి ఊటగా ఉండు గాక. ఎందుకంటే హతమైన నా ప్రజలను గూర్చి నేను రాత్రింబగళ్ళూ విలపించాలని కోరుతున్నాను.
Ezekiel 2:3 in Telugu 3 ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనాల దగ్గరకీ, ఇశ్రాయేలు ప్రజల దగ్గరకీ నిన్ను పంపిస్తున్నాను. వాళ్ళ పితరులూ, వాళ్ళూ ఈ రోజు వరకూ నాకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు.
Ezekiel 2:5 in Telugu 5 వాళ్ళు తిరగబడే జనం. అలా ప్రకటిస్తే వాళ్ళు విన్నా, వినకున్నా కనీసం వాళ్ళ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకుంటారు.
Ezekiel 3:9 in Telugu 9 నీ నుదురును వజ్రంలా చేశాను. దాన్ని చెకుముకి రాయి కంటే కఠినంగా చేశాను. వాళ్ళు తిరగబడే జాతి అని వాళ్ళకి నువ్వు భయపడకు. వాళ్ళ ముఖాలు చూసి నిరుత్సాహపడవద్దు.”
Ezekiel 3:26 in Telugu 26 వాళ్ళు తిరగబడే ప్రజలు కాబట్టి నువ్వు వాళ్ళని గద్దించకుండా నేను నీ నాలుకను నీ నోట్లో అంగిలికి అంటుకుపోయేలా చేస్తాను. నువ్వు మౌనంగా ఉంటావు.
Ezekiel 17:12 in Telugu 12 “తిరగబడే జాతికి ఇలా చెప్పు. ఈ మాటల భావం మీకు తెలియదా? చూడండి! బబులోనురాజు యెరూషలేముకు వచ్చి ఆమె రాజునూ ఆమె యువరాజులనూ పట్టుకుని వాళ్ళని బబులోనులో తన దగ్గరకి తీసుకు పోయాడు.
Ezekiel 24:3 in Telugu 3 తిరుగుబాటుచేసే ఈ ప్రజలకు ఉపమాన రీతిగా ఒక సామెత చెప్పు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, వంట కుండ తెచ్చి అందులో నీళ్లు పోసి దాన్ని పొయ్యి మీద పెట్టు.
Ezekiel 44:6 in Telugu 6 తిరుగుబాటు చేసే ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటించు, ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘ఇశ్రాయేలీయులారా, ఇంతవరకూ మీరు చేసిన అకృత్యాలు చాలు.
Daniel 9:5 in Telugu 5 మేము పాపం, అతిక్రమం చేశాము. నీ ఆజ్ఞల నుండి, విధుల నుండి తప్పి పోయి, తిరుగుబాటు చేశాము.
Matthew 13:13 in Telugu 13 ఇందుకోసమే నేను వారికి ఉపమానాలతో బోధిస్తున్నాను. వారు చూస్తున్నారు గానీ నిజానికి చూడరు. వింటున్నారు గానీ నిజానికి వినరు, అర్థం చేసుకోరు.
Mark 4:12 in Telugu 12 ఎందుకంటే, వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి. వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో.”
Mark 8:17 in Telugu 17 అది కనిపెట్టి యేసు, “రొట్టెలు లేవనే విషయం ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు గ్రహించలేదా? మీ బుద్ధి మందగించిందా?
Luke 8:10 in Telugu 10 ఆయన, “దేవుని రాజ్య రహస్య సత్యాలు తెలుసుకునే ఆధిక్యత మీరు పొందారు. ఇతరులైతే చూస్తూ ఉన్నా నిజంగా చూడకుండా, వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉంటారు గనక వారికి ఉపమానాల్లోనే బోధిస్తున్నాను.
John 9:39 in Telugu 39 అప్పుడు యేసు, “‘చూడనివారు చూడాలి. చూసేవారు గుడ్డివారు కావాలి’ అనే తీర్పు జరగడం కోసం నేను ఈ లోకంలోకి వచ్చాను” అన్నాడు.
John 12:40 in Telugu 40 “ఆయన వారి కళ్ళకు గుడ్డితనం కలగజేశాడు. ఆయన వారి హృదయాలను కఠినం చేశాడు. అలా చెయ్యకపోతే వారు తమ కళ్ళతో చూసి, హృదయాలతో గ్రహించి, నా వైపు తిరిగేవారు. అప్పుడు నేను వారిని బాగు చేసేవాణ్ణి.”
Acts 7:51 in Telugu 51 “మీరు మెడ వంచనివారూ, హృదయంలో చెవులలో సున్నతి లేని వారు. మీరు కూడా మీ పూర్వీకుల లాగే ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు.
Acts 28:26 in Telugu 26 వారు వింటారు గాని అర్థం చేసుకోరు. చూస్తారు కానీ గ్రహించుకోరు’ అని ఈ ప్రజలతో చెప్పండి.
Romans 11:7 in Telugu 7 అప్పుడేమైంది? ఇశ్రాయేలు ప్రజలు దేనినైతే వెదికారో అది వారికి దొరకలేదు, దేవుని కృప ద్వారా ఎన్నికైన వారికే అది దొరికింది. మిగిలినవారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు.
2 Corinthians 3:14 in Telugu 14 అయితే వారి మనసులు మూసుకు పోయాయి. ఇప్పటి వరకూ వారు పాత ఒడంబడిక చదివేటప్పుడు ఆ ముసుకు అలానే ఉంది. ఎందుకంటే కేవలం క్రీస్తులో దేవుడు దాన్ని తీసివేశాడు.
2 Corinthians 4:3 in Telugu 3 ఒకవేళ మా సువార్త అగోచరంగా ఉంది అంటే అది కేవలం నాశనమై పోతున్నవారికే.
Ephesians 4:18 in Telugu 18 ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు.
2 Thessalonians 2:10 in Telugu 10 ఎందుకంటే వారు రక్షణ పొందేలా సత్యాన్ని ప్రేమించలేదు, అంగీకరించలేదు.