Ephesians 1:5 in Telugu 5 యేసు క్రీస్తు ద్వారా మనలను తన సొంత కుమారులుగా స్వీకరించడానికి దేవుడు తన ప్రేమతో ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ఆయనకు ఎంతో ఆనందం. ఆయన ఆశించింది అదే.
Other Translations King James Version (KJV) Having predestinated us unto the adoption of children by Jesus Christ to himself, according to the good pleasure of his will,
American Standard Version (ASV) having foreordained us unto adoption as sons through Jesus Christ unto himself, according to the good pleasure of his will,
Bible in Basic English (BBE) As we were designed before by him for the position of sons to himself, through Jesus Christ, in the good pleasure of his purpose,
Darby English Bible (DBY) having marked us out beforehand for adoption through Jesus Christ to himself, according to the good pleasure of his will,
World English Bible (WEB) having predestined us for adoption as children through Jesus Christ to himself, according to the good pleasure of his desire,
Young's Literal Translation (YLT) having foreordained us to the adoption of sons through Jesus Christ to Himself, according to the good pleasure of His will,
Cross Reference Jeremiah 3:4 in Telugu 4 అయినా ఇప్పుడు నువ్వు “నా తండ్రీ, చిన్నప్పటి నుండి నాకు దగ్గర స్నేహితుడివి” అని నాకు మొర పెడుతున్నావు.
Jeremiah 3:19 in Telugu 19 నిన్ను నా కొడుకుగా చేసుకుని, ఏ జనానికీ లేనంత సుందరమైన దేశాన్ని నీకు వారసత్వంగా ఇవ్వాలని కోరుకున్నాను. నువ్వు నా తండ్రీ అని పిలుస్తూ నా వెంట రావాలని కోరుకున్నాను.
Daniel 4:35 in Telugu 35 భూలోకంలోని ప్రజలంతా ఆయన దృష్టిలో శూన్యులు. ఆయన పరలోకంలోని సైన్యాల మీదా, భూలోకంలోని ప్రజల మీదా తన ఇష్టం వచ్చినట్టు జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని “నువ్వు చేస్తున్నదేమిటి?” అని అడిగే అధికారం ఎవ్వరికీ లేదు.
Hosea 1:10 in Telugu 10 అయినప్పటికీ ఇశ్రాయేలీయుల జనసంఖ్య సముద్రతీరంలో ఇసుకంత విస్తారం అవుతుంది. దాన్ని కొలవలేము, లెక్కబెట్టలేము. ఎక్కడ ‘మీరు నా ప్రజలు కారు’ అని వారితో చెప్పానో, అక్కడే ‘మీరు సజీవుడైన దేవుని ప్రజలు’ అని వారికి చెబుతారు.
Matthew 11:26 in Telugu 26 అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకెంతో ఇష్టం.
Luke 10:21 in Telugu 21 ఆ సమయంలోనే యేసు పరిశుద్ధాత్మలో ఎంతో ఆనందించాడు. “తండ్రీ, ఆకాశానికీ భూమికీ ప్రభూ, నువ్వు ఈ సంగతులను జ్ఞానులకూ, తెలివైన వారికీ దాచిపెట్టి పసివారికి వెల్లడి పరిచావని నిన్ను కీర్తిస్తున్నాను. అవును తండ్రీ, అలా చేయడం నీకు అనుకూలం ఆయింది.”
Luke 11:32 in Telugu 32 నీనెవె ప్రజలు తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతారు. ఎందుకంటే వారు యోనా బోధ విని మారుమనస్సు పొందారు. యోనా కంటే ఘనుడు ఇక్కడ ఉన్నాడు.
John 1:12 in Telugu 12 తనను ఎవరెవరు అంగీకరించారో, అంటే తన నామంలో నమ్మకం ఉంచారో, వారికందరికీ దేవుని పిల్లలు అయ్యే హక్కును ఆయన ఇచ్చాడు.
John 11:52 in Telugu 52 ఆ జాతి కోసం మాత్రమే కాకుండా, వివిధ ప్రాంతాల్లోకి చెదరిపోయిన దేవుని పిల్లలను ఒకటిగా సమకూర్చేలా యేసు చనిపోవాలని అతడు ప్రవచించాడు.
John 20:17 in Telugu 17 యేసు ఆమెతో, “నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కి పోలేదు. కాబట్టి నన్ను తాకవద్దు. కానీ నా సోదరుల దగ్గరికి వెళ్ళి నా తండ్రీ, మీ తండ్రీ, నా దేవుడూ, మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి ఆరోహణం అవుతున్నానని వారికి చెప్పు” అన్నాడు.
Romans 8:14 in Telugu 14 దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు.
Romans 8:23 in Telugu 23 అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం.
Romans 8:29 in Telugu 29 ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు.
Romans 9:11 in Telugu 11 దేవుని ఎన్నిక ప్రకారమైన ఆయన సంకల్పం, చేసే పనుల మూలంగా కాక వారిని పిలిచినవాడి మూలంగానే నెరవేరడం కోసం,
1 Corinthians 1:1 in Telugu 1 దేవుడు తన సంకల్పం ద్వారా యేసు క్రీస్తు అపొస్తలుడుగా ఉండడానికి పిలిచిన పౌలు, మన సోదరుడు సొస్తెనేసు,
1 Corinthians 1:21 in Telugu 21 లోకం తన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేక పోయింది కాబట్టి, సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మేవారిని రక్షించడానికి దేవుడు దయతో సంకల్పించాడు.
2 Corinthians 6:18 in Telugu 18 “నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రిగా ఉంటాను. మీరు నాకు కొడుకులుగా కూతురులుగా ఉంటారు” అని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు.
Galatians 3:26 in Telugu 26 యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం ద్వారా దేవుని కుమారులు.
Galatians 4:5 in Telugu 5 మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు.
Ephesians 1:9 in Telugu 9 ఆయన క్రీస్తు ద్వారా తన ఇష్ట పూర్తిగా ప్రదర్శించిన పథకం తాలూకు రహస్య సత్యాన్ని మనకు తెలియజేశాడు.
Ephesians 1:11 in Telugu 11 క్రీస్తును ముందుగా నమ్మిన మనం తన మహిమకు కీర్తి కలగజేయాలని,
Philippians 2:13 in Telugu 13 ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి కావలసిన సంకల్పాన్ని, కార్యసిద్ధిని కలుగజేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు.
2 Thessalonians 1:11 in Telugu 11 ఈ కారణం చేత మీకు అందిన పిలుపుకి తగిన వారిగా మిమ్మల్ని దేవుడు ఎంచాలనీ, మేలు చేయాలనే మీ ప్రతి ఆలోచననూ విశ్వాస మూలమైన ప్రతి పనినీ ఆయన తన బల ప్రభావాలతో నెరవేర్చాలనీ మేము మీ కోసం అనునిత్యం ప్రార్ధిస్తున్నాము.
Hebrews 2:10 in Telugu 10 ఎందుకంటే ఎవరి కోసం అన్నీ ఉనికిలో ఉన్నాయో, ఎవరి వలన సమస్తమూ కలుగుతున్నాయో ఆయన అనేకమంది కుమారులను మహిమకు తీసుకురావడం కోసం వారి రక్షణ కర్తను తాను పొందే బాధల ద్వారా సంపూర్ణుణ్ణి చేయడం దేవునికి సమంజసమే.
Hebrews 12:5 in Telugu 5 కుమారులుగా మీకు ఉపదేశించే ప్రోత్సాహపు మాటలను మీరు మరచిపోయారు. “నా కుమారా, ప్రభువు క్రమశిక్షణను తేలికగా తీసుకోవద్దు. ఆయన నిన్ను సరి చేసినప్పుడు నిరుత్సాహ పడవద్దు.”
1 John 3:1 in Telugu 1 మనం దేవుని పిల్లలం అని పిలిపించుకోవాలని తండ్రి మనకు ఎలాటి ప్రేమను కట్టబెట్టాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఆ కారణం చేత లోకం మనలను గుర్తించదు, ఎందుకంటే అది దేవుణ్ణి ఎరగదు.
Revelation 21:7 in Telugu 7 జయించేవాడు వీటిని పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు.