Ecclesiastes 5:8 in Telugu 8 ఒక రాజ్యంలో బీదవారిని బాధించడం, ధర్మాన్ని, న్యాయాన్ని బలవంతంగా అణచివేయడం నీకు కనిపిస్తే ఆశ్చర్యపోవద్దు. అధికారంలో ఉన్నవారికంటే ఎక్కువ అధికారం గలవారున్నారు. వారందరి పైన ఇంకా ఎక్కువ అధికారం గలవాడు ఉన్నాడు.
Other Translations King James Version (KJV) If thou seest the oppression of the poor, and violent perverting of judgment and justice in a province, marvel not at the matter: for he that is higher than the highest regardeth; and there be higher than they.
American Standard Version (ASV) If thou seest the oppression of the poor, and the violent taking away of justice and righteousness in a province, marvel not at the matter: for one higher than the high regardeth; and there are higher than they.
Bible in Basic English (BBE) It is good generally for a country where the land is worked to have a king.
Darby English Bible (DBY) If thou seest the oppression of the poor, and violent perverting of judgment and justice in a province, marvel not at the matter; for a higher than the high is watching, and there are higher than they.
World English Bible (WEB) If you see the oppression of the poor, and the violent taking away of justice and righteousness in a district, don't marvel at the matter: for one official is eyed by a higher one; and there are officials over them.
Young's Literal Translation (YLT) If oppression of the poor, and violent taking away of judgment and righteousness thou seest in a province, do not marvel at the matter, for a higher than the high is observing, and high ones `are' over them.
Cross Reference 1 Kings 21:19 in Telugu 19 నీవు అతనితో ఇలా చెప్పు, యెహోవా చెప్పేదేమిటంటే దీన్ని స్వాధీనం చేసుకోవాలని నీవు నాబోతును చంపించావు గదా! యెహోవా చెప్పేదేమిటంటే ఏ స్థలం లో కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో ఆ స్థలం లోనే కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయి.”
1 Chronicles 21:15 in Telugu 15 యెరూషలేమును నాశనం చెయ్యడానికి దేవుడు ఒక దూతను పంపాడు. అతడు నాశనం చెయ్యబోతున్నప్పుడు యెహోవా చూసి, ఆ కీడు విషయంలో బాధపడి, నాశనం చేసే దూతతో “చాలు, ఇప్పుడు నీ చెయ్యి వెనక్కి తీసుకో” అని చెప్పగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం దగ్గర నిలబడ్డాడు.
Job 20:19 in Telugu 19 వాళ్ళు దరిద్రులపై దాడులు చేసి విడిచిపెట్టినవాళ్ళు. తమవి కాని ఇళ్ళను బలవంతంగా ఆక్రమించుకుంటారు. ఆ ఇళ్ళను కట్టి పూర్తి చేయరు.
Job 27:8 in Telugu 8 దేవుడు అతణ్ణి కొట్టివేసేటప్పుడు, వాడి ప్రాణం తీసేసేటప్పుడు భక్తిహీనుడికి ఆధారమేది?
Psalm 10:17 in Telugu 17 యెహోవా, పీడితుల అవసరతలు నువ్వు విన్నావు. నువ్వు వాళ్ళ హృదయాన్ని బలపరుస్తావు. వాళ్ళ ప్రార్థన వింటావు.
Psalm 12:5 in Telugu 5 పేదలకు విరోధంగా జరుగుతున్న హింస కారణంగా, అవసరతలో ఉన్నవాళ్ళ మూలుగుల కారణంగా నేను లేచి వస్తాను, అని యెహోవా అంటున్నాడు. వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ రక్షణ నేను వాళ్లకు అందిస్తాను.
Psalm 55:9 in Telugu 9 పట్టణంలో హింస, కలహాలు నేను చూశాను. ప్రభూ, అలాటి పనులు చేసేవారిని నిర్మూలం చెయ్యి. వారి మాటలు తారుమారు చెయ్యి.
Psalm 58:10 in Telugu 10 వారికి కలిగిన శిక్షను చూసి నీతిమంతులు సంతోషిస్తారు. ఆ దుష్టుల రక్తంలో వారు తమ పాదాలు కడుక్కుంటారు.
Psalm 82:1 in Telugu 1 ఆసాపు కీర్తన దివ్య సమాజంలో దేవుడు నిలబడి ఉన్నాడు. దేవుళ్ళ మధ్య ఆయన తీర్పు తీర్చేవాడు.
Psalm 83:18 in Telugu 18 యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే లోకమంతట్లో మహోన్నతుడవని వాళ్ళు తెలుసుకుంటారు.
Psalm 95:3 in Telugu 3 యెహోవా గొప్ప దేవుడు. దేవుళ్ళందరికీ పైగా ఉన్న గొప్ప రాజు.
Psalm 140:11 in Telugu 11 దూషకులకు భూమి మీద భద్రత లేకుండా పోవాలి. దుర్మార్గులను ఆపదలు వెంటాడి పడగొట్టాలి.
Proverbs 8:17 in Telugu 17 నన్ను ప్రేమించే వాళ్ళను నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెదికే వాళ్ళు నన్ను కనుక్కుంటారు.
Ecclesiastes 3:16 in Telugu 16 అంతేగాక ఈ లోకంలో న్యాయతీర్పు జరిగించే స్థలాల్లో, నీతి ఉండాల్సిన స్థలాల్లో నాకు దుష్టత్వం కనిపించింది.
Ecclesiastes 4:1 in Telugu 1 ఆ తరవాత సూర్యుని కింద జరుగుతున్న వివిధ రకాల అన్యాయాలను గురించి నేను ఆలోచించాను. బాధలు పడేవారు కన్నీరు కారుస్తున్నారు. వారికి ఆదరణ లేదు. వారిని అణచి వేసే వారు బలవంతులు కాబట్టి వారిని ఆదరించేవారెవరూ లేరు.
Isaiah 3:15 in Telugu 15 నా ప్రజలను నలగ్గొట్టి, వాళ్ళ ముఖాలు మీరెందుకు నేల రాస్తున్నారు?” అని ప్రభువూ, సేనలకు అధిపతీ అయిన యెహోవా అంటున్నాడు.
Isaiah 5:7 in Telugu 7 ఇశ్రాయేలు వంశం సేనల ప్రభువైన యెహోవా ద్రాక్షతోట. యూదా ప్రజలు ఆయనకిష్టమైన వనం. ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడింది. నీతి కోసం చూస్తే రోదనం వినబడింది.
Isaiah 10:5 in Telugu 5 అష్షూరీయులకు బాధ, వాళ్ళు నా కోపానికి సాధనమైన గద. నా ఉగ్రతను తీర్చుకునే దుడ్డు కర్ర.
Isaiah 10:12 in Telugu 12 సీయోను కొండ మీద, యెరూషలేము మీద ప్రభువు తన కార్యమంతా నెరవేర్చిన తరువాత ఆయన “నేను అష్షూరు రాజు హృదయ గర్వం కారణంగా అతని మాటను బట్టి, అతని కళ్ళల్లోని అహంకారపు చూపులను బట్టి, అతన్ని శిక్షిస్తాను” అంటాడు.
Isaiah 37:36 in Telugu 36 అప్పుడు యెహోవా దూత వెళ్ళి అష్షూరువారి సైనిక పటాలంలో 1,85,000 మందిని హతమార్చాడు. ఉదయాన్నే ప్రజలు చూసినప్పుడు వారంతా శవాలుగా పడి ఉన్నారు.
Isaiah 46:10 in Telugu 10 ఆది నుండి అంతం వరకు కలగబోయే వాటిని నేను ప్రకటిస్తాను. ఇంకా జరగని వాటిని ముందుగానే తెలియజేస్తాను. “నా సంకల్పం జరుగుతుంది. నా చిత్తమంతా నేను నెరవేర్చుకుంటాను” అని నేను చెబుతున్నాను.
Isaiah 57:15 in Telugu 15 ఎందుకంటే, మహా ఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి అయినవాడు ఇలా చెబుతున్నాడు. “నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తూ ఉన్నాను. అయినా, వినయంగల వారితో నలిగిన వారితో కూడా ఉంటాను. వినయం గలవారి ప్రాణాన్ని సేదదీర్చడానికీ నలిగినవారి ప్రాణాన్ని తెప్పరిల్లజేయడానికీ నేనున్నాను.
Isaiah 59:13 in Telugu 13 యెహోవాను తిరస్కరించి మన దేవుని నుంచి తొలగిపోయి తిరుగుబాటు చేశాం. దుర్మార్గతనూ అవిధేయతనూ ప్రోత్సహించాం. అబద్ధాలూ సణుగులూ మనసులో కల్పించుకున్నాం.
Jeremiah 22:17 in Telugu 17 అయితే అక్రమ సంపాదనపై, నిర్దోషుల రక్తం ఒలికించడంపై, దుర్మార్గం చేయడంపై, ఇతరులను అణగదొక్కడంపై నీ దృష్టి, మనసూ ఉంది.
Ezekiel 22:6 in Telugu 6 నీలోని ఇశ్రాయేలీయుల నాయకులందరూ తమ శక్తి కొలదీ రక్తం ఒలికించడానికి వచ్చారు.
Amos 5:12 in Telugu 12 మీ నేరాలెన్నో నాకు తెలుసు. మీ పాపాలు ఎంత భయంకరమైనవో నాకు తెలుసు. మీరు లంచాలు తీసుకుని తప్పుచేయని వారిని బాధిస్తారు. ఊరి గుమ్మం దగ్గర పేదలను పట్టించుకోరు.
Amos 6:2 in Telugu 2 మీ నాయకులు ఇలా చెబుతున్నారు, కల్నేకు వెళ్లి చూడండి. అక్కడ నుంచి హమాతు అనే గొప్ప పట్టణానికి వెళ్ళండి. ఆ తరువాత ఫిలిష్తీయుల పట్టణం గాతు వెళ్ళండి. అవి మీ రెండు రాజ్యాలకంటే గొప్పవి కావా? వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటే విశాలమైనవి కావా?
Amos 6:12 in Telugu 12 గుర్రాలు బండలమీద పరుగెత్తుతాయా? అలాంటి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? అయితే మీరు న్యాయాన్ని విషతుల్యం చేశారు.
Amos 8:4 in Telugu 4 దేశంలోని పేదలను తీసేస్తూ దీనులను అణిచేసే మీరు ఈ విషయం వినండి.
Micah 2:1 in Telugu 1 మంచాల మీద పడుకుని మోసపు పనులు ఆలోచిస్తూ దుర్మార్గాలు చేసేవారికి బాధ తప్పదు. వాళ్లకు అధికారముంది కాబట్టి పగటి వెలుతురులో వాళ్ళు అలా చేస్తారు.
Micah 2:9 in Telugu 9 వారికిష్టమైన ఇళ్ళల్లోనుంచి నా ప్రజల్లోని స్త్రీలను మీరు వెళ్లగొడతారు. వారి సంతానం మధ్య నా ఘనతను ఎన్నటికీ ఉండకుండాా చేస్తున్నారు.
Micah 3:1 in Telugu 1 నేనిలా చెప్పాను. “యాకోబు నాయకులారా, ఇశ్రాయేలీయుల అధికారులారా, ఇప్పుడు వినండి. న్యాయం అంటే ఏంటో మీరు తెలుసుకోవద్దా?
Micah 3:9 in Telugu 9 యాకోబు వంశపు ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఈ మాట వినండి. మీరు న్యాయాన్ని తృణీకరిస్తూ సక్రమంగా ఉండే సమస్తాన్నీ వక్రం చేస్తారు.
Micah 6:10 in Telugu 10 దుర్మార్గుల ఇళ్ళల్లో అన్యాయంగా సంపాదించిన సంపద ఉంది. అసహ్యకరమైన తప్పుడు తూకాలున్నాయి.
Habakkuk 1:2 in Telugu 2 “యెహోవా, నేను మొర్రపెట్టినా నీవెన్నాళ్లు ఆలకించకుండా ఉంటావు? బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినా నువ్వు రక్షించడం లేదు.
Habakkuk 1:12 in Telugu 12 యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నువ్వున్న వాడవు కావా? మేము మరణించము. యెహోవా, తీర్పుకే నువ్వు వారిని నియమించావు. ఆశ్రయ దుర్గమా, మమ్మల్ని దండించడానికే వారిని పుట్టించావు.
Zechariah 7:9 in Telugu 9 “సేనల ప్రభువైన యెహోవా ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. సత్యాన్ననుసరించి తీర్పు తీర్చండి. ఒకరిపట్ల ఒకరు కరుణా వాత్సల్యం కనపరచుకోండి.
Zechariah 8:6 in Telugu 6 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే ఆ దినాల్లో మిగిలి ఉన్న ప్రజలకు ఇది ఆశ్చర్యంగా ఉన్నా నాకు కూడా ఆశ్చర్యంగా ఉంటుందా? ఇదే యెహోవా వాక్కు.
Malachi 3:5 in Telugu 5 తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అబద్దసాక్ష్యం పలికే వారి మీద నా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నేనంటే భయం లేకుండా కూలి ఇచ్చే విషయంలో కూలివాళ్ళను, విధవరాండ్రను, తండ్రిలేనివారిని బాధపెట్టినవారి విషయంలో, పరాయి దేశస్థుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి విషయంలో నేను బలంగా సాక్ష్యం పలుకుతాను అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.
Matthew 13:41 in Telugu 41 మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు.
Luke 1:32 in Telugu 32 ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అంటారు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు.
Luke 1:35 in Telugu 35 ఆ దూత, “పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు.
Luke 1:76 in Telugu 76 ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు. మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి, వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా, ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు.
Acts 4:27 in Telugu 27 ఏవి జరగాలని నీవు సంకల్పించి ముందుగానే నిర్ణయించావో, వాటన్నిటినీ చేయడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా
Acts 12:7 in Telugu 7 ఇదుగో, అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును తట్టి, త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల నుంచి సంకెళ్ళు ఊడి పడ్డాయి.
Acts 12:23 in Telugu 23 అయితే అతడు దేవునికి మహిమను ఆపాదించనందుకు వెంటనే ప్రభువు దూత అతనిని ఘోర వ్యాధికి గురిచేశాడు. అతడు పురుగులు పడి చచ్చాడు.
Romans 11:33 in Telugu 33 ఆహా, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం ఎవరి తరం. ఆయన మార్గాలు మన ఊహకు అందనివి.
James 2:13 in Telugu 13 కనికరం చూపించని వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది. కనికరం తీర్పును జయిస్తుంది.
James 5:2 in Telugu 2 మీ సిరిసంపదలు శిథిలమైపోయాయి. మీ బట్టలు చిమ్మెటలు కొట్టేస్తున్నాయి.
1 Peter 4:12 in Telugu 12 ప్రియులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీకు వచ్చే అగ్నిలాంటి విపత్తును గురించి మీకేదో వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపోవద్దు.
1 John 3:13 in Telugu 13 నా సోదరులారా, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి.
Revelation 17:6 in Telugu 6 ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తాన్నీ, యేసు హతసాక్షుల రక్తాన్నీ తాగి మత్తెక్కి ఉండడం చూశాను. అది చూసి నేను ఆశ్చర్యపోయాను.