Ecclesiastes 4:1 in Telugu 1 ఆ తరవాత సూర్యుని కింద జరుగుతున్న వివిధ రకాల అన్యాయాలను గురించి నేను ఆలోచించాను. బాధలు పడేవారు కన్నీరు కారుస్తున్నారు. వారికి ఆదరణ లేదు. వారిని అణచి వేసే వారు బలవంతులు కాబట్టి వారిని ఆదరించేవారెవరూ లేరు.
Other Translations King James Version (KJV) So I returned, and considered all the oppressions that are done under the sun: and behold the tears of such as were oppressed, and they had no comforter; and on the side of their oppressors there was power; but they had no comforter.
American Standard Version (ASV) Then I returned and saw all the oppressions that are done under the sun: and, behold, the tears of such as were oppressed, and they had no comforter; and on the side of their oppressors there was power; but they had no comforter.
Bible in Basic English (BBE) And again I saw all the cruel things which are done under the sun; there was the weeping of those who have evil done to them, and they had no comforter: and from the hands of the evil-doers there went out power, but they had no comforter.
Darby English Bible (DBY) And I returned and saw all the oppressions that are done under the sun: and behold, the tears of the oppressed, and they had no comforter; and on the side of their oppressors was power, and they had no comforter.
World English Bible (WEB) Then I returned and saw all the oppressions that are done under the sun: and, behold, the tears of those who were oppressed, and they had no comforter; and on the side of their oppressors there was power; but they had no comforter.
Young's Literal Translation (YLT) And I have turned, and I see all the oppressions that are done under the sun, and lo, the tear of the oppressed, and they have no comforter; and at the hand of their oppressors `is' power, and they have no comforter.
Cross Reference Exodus 1:13 in Telugu 13 ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో మరింత కష్టమైన పనులు చేయించుకున్నారు.
Exodus 1:16 in Telugu 16 “మీరు హెబ్రీ స్త్రీలకు పురుడు పోస్తున్నప్పుడు జాగ్రత్తగా కనిపెట్టి చూడండి. మగ పిల్లవాడు పుడితే ఆ బిడ్డను చంపివేయండి, ఆడ పిల్ల అయితే బతకనియ్యండి” అన్నాడు.
Exodus 1:22 in Telugu 22 అప్పుడు ఫరో “హెబ్రీయుల్లో పుట్టిన ప్రతి ఆడపిల్లను బతకనియ్యండి, మగపిల్లవాణ్ణి నదిలో పడవేయండి” అని తన ఐగుప్తు ప్రజలకు ఆజ్ఞాపించాడు.
Exodus 2:23 in Telugu 23 ఈ విధంగా చాలా రోజులు గడచిపోయిన తరువాత ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బానిసత్వంలోనే ఉండి, నిట్టూర్పులు విడుస్తూ మొర పెడుతూ ఉన్నారు. తమ వెట్టిచాకిరీ మూలంగా వారు పెట్టిన మొరలు దేవుని సన్నిధికి చేరాయి.
Exodus 5:16 in Telugu 16 తమ దాసులకు గడ్డి ఇవ్వకుండా రోజువారీ లెక్క ప్రకారం ఇటుకలు తయారు చేయమని ఆజ్ఞాపిస్తున్నారు. అధికారులు తమ దాసులైన మా నాయకులను హింసిస్తున్నారు. అసలు తప్పు తమ ఆస్థాన అధికారులదే” అని మొర పెట్టుకున్నారు.
Deuteronomy 28:33 in Telugu 33 మీకు తెలియని ప్రజలు మీ పొలం పంట, మీ కష్టార్జితమంతా తినివేస్తారు. మిమ్మల్ని ఎప్పుడూ బాధించి, అణచి ఉంచుతారు.
Deuteronomy 28:48 in Telugu 48 కాబట్టి యెహోవా మీ మీదికి రప్పించే మీ శత్రువులకు మీరు బానిసలవుతారు. ఆకలితో, దాహంతో, దిగంబరులుగా, పేదరికం అనుభవిస్తూ వారికి సేవ చేస్తారు. మీరు నాశనం అయ్యే వరకూ మీ మెడ మీద ఇనుపకాడి ఉంచుతారు.
Judges 4:3 in Telugu 3 అతనికి తొమ్మిది వందల ఇనుప రథాలు ఉన్నాయి. అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలీయులను కఠినంగా హింసలపాలు చేసినప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టారు.
Judges 10:7 in Telugu 7 యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండినప్పుడు, ఆయన ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వాళ్ళను అప్పగించాడు గనుక,
Nehemiah 5:1 in Telugu 1 తరువాత ప్రజలు, వారి భార్యలు తమ సాటి యూదుల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు.
Job 6:29 in Telugu 29 ఆలోచించండి. మీరు చెప్పే తీర్పులో అన్యాయం ఉండకూడదు. మళ్ళీ ఆలోచించండి, ఈ విషయాల్లో నేను నిర్దోషిని.
Job 16:4 in Telugu 4 నా దుస్థితి మీకు పట్టి ఉంటే నేను కూడా మీలాగా మాట్లాడేవాణ్ణి. మీ మీద లేనిపోని మాటలు కల్పిస్తూ నా తల ఆడిస్తూ మీవైపు చూసేవాణ్ణి.
Job 19:21 in Telugu 21 నా మీద జాలి పడండి. దేవుని హస్తం నన్ను పూర్తిగా దెబ్బతీసింది. నా స్నేహితులారా నా మీద జాలి చూపండి.
Job 24:7 in Telugu 7 బట్టలు లేక రాత్రి అంతా పడుకుని ఉంటారు. చలిలో కప్పుకోడానికి ఏమీ లేక అలా పడి ఉంటారు.
Job 35:9 in Telugu 9 అనేకమైన అణచివేత క్రియల వలన ప్రజలు అక్రోశిస్తారు. బలవంతుల భుజబలానికి భయపడి సహాయం కోసం కేకలు పెడతారు.
Psalm 10:9 in Telugu 9 గుబురుగా ఉన్న పొదలోని సింహం లాగా అతడు దాగి ఉంటాడు. పీడితులను పట్టుకోవడానికి పొంచి ఉంటాడు. తన వలను లాగి పీడితులను పట్టుకుంటాడు.
Psalm 12:5 in Telugu 5 పేదలకు విరోధంగా జరుగుతున్న హింస కారణంగా, అవసరతలో ఉన్నవాళ్ళ మూలుగుల కారణంగా నేను లేచి వస్తాను, అని యెహోవా అంటున్నాడు. వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ రక్షణ నేను వాళ్లకు అందిస్తాను.
Psalm 42:3 in Telugu 3 నా శత్రువులు ప్రతినిత్యం నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? అంటుంటే నా కన్నీళ్ళే రేయింబవళ్ళు నాకు ఆహారమయ్యాయి.
Psalm 42:9 in Telugu 9 నా ఆశ్రయశిల అయిన దేవునితో ఇలా అంటాను. నువ్వు నన్నెందుకు మర్చిపోయావు? శత్రువు నన్ను అణగదొక్కుతూ ఉంటే నేను రోదిస్తూ ఎందుకు తిరగాలి?
Psalm 69:20 in Telugu 20 నింద వలన నా హృదయం బద్దలైంది. నేను ఎంతో కృశించిపోయాను. నన్ను ఎవరైనా కనికరిస్తారేమో అని చూశాను గానీ ఎవరూ లేరు. ఓదార్చే వారి కోసం కనిపెట్టాను గాని ఎవరూ కనిపించ లేదు.
Psalm 80:5 in Telugu 5 కన్నీళ్లు వారికి ఆహారంగా ఇస్తున్నావు. తాగడానికి కడివెడు కన్నీళ్లు వాళ్లకిచ్చావు.
Psalm 102:8 in Telugu 8 రోజంతా నా విరోధులు నా మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నన్ను నిందించేవాళ్ళు నా పేరు ఎత్తి శపిస్తారు.
Psalm 142:4 in Telugu 4 నా కుడి పక్కన చూస్తే నన్ను ఆదరించేవాడు ఒక్కడు కూడా కనిపించలేదు. తప్పించుకునే దారి లేదు. నాప్రాణం గురించి పట్టించుకునే వాడే లేడు.
Proverbs 19:7 in Telugu 7 పేదవాణ్ణి అతని బంధువులంతా ఏవగించుకుంటారు. అలాగైతే అతని స్నేహితులు మరింకెంతగా దూరమైపోతారు! వాడు వాళ్ళను పిలుస్తాడు గానీ వాళ్ళక్కడ ఉండరు.
Proverbs 28:3 in Telugu 3 పేదలను బాధించే పేదవాడు ఆహారపదార్థాలను కొట్టుకుపోయేలా చేసే వానతో సమానం.
Proverbs 28:15 in Telugu 15 పేద ప్రజలను పరిపాలించే దుష్టుడు గర్జించే సింహం, దాడి చేసే ఎలుగుబంటి లాంటి వాడు.
Ecclesiastes 3:16 in Telugu 16 అంతేగాక ఈ లోకంలో న్యాయతీర్పు జరిగించే స్థలాల్లో, నీతి ఉండాల్సిన స్థలాల్లో నాకు దుష్టత్వం కనిపించింది.
Ecclesiastes 5:8 in Telugu 8 ఒక రాజ్యంలో బీదవారిని బాధించడం, ధర్మాన్ని, న్యాయాన్ని బలవంతంగా అణచివేయడం నీకు కనిపిస్తే ఆశ్చర్యపోవద్దు. అధికారంలో ఉన్నవారికంటే ఎక్కువ అధికారం గలవారున్నారు. వారందరి పైన ఇంకా ఎక్కువ అధికారం గలవాడు ఉన్నాడు.
Ecclesiastes 7:7 in Telugu 7 జ్ఞానులు అన్యాయం చేస్తే వారి బుద్ధి చెడిపోయినట్టే. లంచం మనసును చెడగొడుతుంది.
Isaiah 5:7 in Telugu 7 ఇశ్రాయేలు వంశం సేనల ప్రభువైన యెహోవా ద్రాక్షతోట. యూదా ప్రజలు ఆయనకిష్టమైన వనం. ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడింది. నీతి కోసం చూస్తే రోదనం వినబడింది.
Isaiah 51:23 in Telugu 23 నిన్ను బాధించేవాళ్ళ చేతిలో దాన్ని పెడతాను. ‘మేము నీ మీద నడిచిపోతాం. సాష్టాంగ పడు’ అని వాళ్ళు నీతో చెబితే నువ్వు నీ వీపును దాటే వారికి దారిగా చేసి నేలకు దాన్ని వంచావు గదా.”
Isaiah 59:7 in Telugu 7 వారి కాళ్లు పాపం చేయడానికి పరుగెడుతున్నాయి. నిరపరాధుల రక్తాన్ని ఒలకపోయడానికి అవి త్వరపడుతున్నాయి. వారి ఆలోచనలు పాపిష్టి ఆలోచనలు. వారి దారులు దుర్మార్గం, నాశనం.
Isaiah 59:13 in Telugu 13 యెహోవాను తిరస్కరించి మన దేవుని నుంచి తొలగిపోయి తిరుగుబాటు చేశాం. దుర్మార్గతనూ అవిధేయతనూ ప్రోత్సహించాం. అబద్ధాలూ సణుగులూ మనసులో కల్పించుకున్నాం.
Lamentations 1:2 in Telugu 2 రాత్రివేళ ఎంతో శోకిస్తూ ఉంది. కన్నీటితో దాని చెంపలు తడిసిపోయాయి. దాని ప్రేమికులెవ్వరూ దాన్ని ఆదరించలేదు. దాని స్నేహితులందరూ దానికి ద్రోహం చేశారు. వాళ్ళు దాని శత్రువులయ్యారు.
Lamentations 1:9 in Telugu 9 దాని చెంగులకు మురికి అంటింది. దాని ఎదుట ఉన్న శిక్ష అది గుర్తు చేసుకోలేదు. అది ఎంతో వింతగా పతనం అయ్యింది. దాన్ని ఆదరించేవాడు ఒక్కడూ లేడు. యెహోవా, నాకు కలిగిన బాధ చూడు. శత్రువులు ఎంత బలంగా ఉన్నారో చూడు!
Malachi 2:13 in Telugu 13 మళ్ళీ రెండోసారి కూడా మీరు అలాగే చేస్తారు. అయితే ఆయన మీ నైవేద్యాన్ని స్వీకరించడు. మీరు అర్పించే అర్పణలు ఆయన లక్ష్యపెట్టడు. అప్పుడు యెహోవా బలిపీఠాన్ని ఏడ్పుతో, కన్నీళ్లతో, రోదనతో మీరు తడుపుతారు.
Malachi 3:5 in Telugu 5 తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అబద్దసాక్ష్యం పలికే వారి మీద నా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నేనంటే భయం లేకుండా కూలి ఇచ్చే విషయంలో కూలివాళ్ళను, విధవరాండ్రను, తండ్రిలేనివారిని బాధపెట్టినవారి విషయంలో, పరాయి దేశస్థుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి విషయంలో నేను బలంగా సాక్ష్యం పలుకుతాను అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.
Malachi 3:18 in Telugu 18 అప్పుడు నీతిమంతులెవరో దుర్మార్గులెవరో, దేవుణ్ణి సేవించేవాళ్ళు ఎవరో, సేవించనివాళ్ళు ఎవరో మీరు మళ్ళీ గుర్తిస్తారు.
Matthew 26:56 in Telugu 56 ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది” అని చెప్పాడు. అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచిపెట్టి పారిపోయారు.
2 Timothy 4:16 in Telugu 16 నేను మొదట న్యాయస్థానం ఎదుట వాదించుకున్నపుడు నా పక్షంగా ఎవరూ నిలబడలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరం కాకుండా ఉండు గాక.
James 5:4 in Telugu 4 చూడండి, మీ చేను కోసిన పనివారి కూలీ ఇవ్వకుండా, మీరు మోసంగా బిగపట్టిన కూలీ కేకలు వేస్తున్నది. మీ కోతపని వారి ఆక్రందనలు సేనల ప్రభువు చెవిని బడుతున్నాయి.