Daniel 9:6 in Telugu 6 నీ దాసులైన ప్రవక్తలు నీ నామాన్ని బట్టి మా రాజులకు, మా అధిపతులకు, మా పూర్వికులకు, యూదయ దేశప్రజలందరికి చెప్పిన మాటలు మేము వినలేదు.
Other Translations King James Version (KJV) Neither have we hearkened unto thy servants the prophets, which spake in thy name to our kings, our princes, and our fathers, and to all the people of the land.
American Standard Version (ASV) neither have we hearkened unto thy servants the prophets, that spake in thy name to our kings, our princes, and our fathers, and to all the people of the land.
Bible in Basic English (BBE) We have not given ear to your servants the prophets, who said words in your name to our kings and our rulers and our fathers and all the people of the land.
Darby English Bible (DBY) And we have not hearkened unto thy servants the prophets, who spoke in thy name to our kings, our princes, and our fathers, and to all the people of the land.
World English Bible (WEB) neither have we listened to your servants the prophets, who spoke in your name to our kings, our princes, and our fathers, and to all the people of the land.
Young's Literal Translation (YLT) and we have not hearkened unto Thy servants, the prophets, who have spoken in Thy name unto our kings, our heads, and our fathers, and to all the people of the land.
Cross Reference 2 Kings 17:13 in Telugu 13 “అయినా మీ గోపురాలను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించి, నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అప్పగించిన ధర్మశాస్త్రంలో ఉన్న నా ఆజ్ఞలు, కట్టడలు ఆచరించండి” అని ప్రవక్తలందరి ద్వారానూ, దీర్ఘదర్శుల ద్వారానూ యెహోవా ఇశ్రాయేలు వాళ్ళకూ, యూదా వాళ్ళకూ సాక్ష్యం పలికించాడు,
2 Chronicles 33:10 in Telugu 10 యెహోవా మనష్షేతో అతని ప్రజలతో మాట్లాడాడు కానీ వారు పట్టించుకోలేదు.
2 Chronicles 36:15 in Telugu 15 వారి పూర్వీకుల దేవుడైన యెహోవా తన ప్రజల మీదా, తన నివాస స్థలం మీదా జాలి పడి వారి దగ్గరికి తన రాయబారులతో సందేశాలు పంపిస్తూ వచ్చాడు.
Ezra 9:7 in Telugu 7 మా పూర్వీకులతో మొదలు ఇప్పటివరకూ మేమంతా ఘోరమైన అపరాధాలు చేస్తూ వచ్చాం. మేము చేసిన దోషాలనుబట్టి ఈ రోజు ఉన్నట్టుగా మేమూ, మా రాజులూ, యాజకులూ అన్యదేశపు రాజుల స్వాధీనంలో, చావుకూ చెరకూ దోపిడీకీ గురై ఉండడం వలన ఎంతో అవమానభారంతో సిగ్గుపడుతూ ఉన్నాం.
Nehemiah 9:32 in Telugu 32 మా దేవా, ఘనుడా, మహా పరాక్రమశాలీ, ఆశ్చర్య కరుడా, నువ్వు చేసిన వాగ్దానం నిలబెడుతూ, కృప చూపుతున్నావు. అష్షూరు రాజుల కాలం నుండి ఈనాటి వరకూ మా మీదికి, మా రాజుల, ప్రధానుల, మా పితరుల మీదికి, నీ ప్రజలందరి మీదికి వచ్చిన బాధలను నీ దృష్టిలో స్వల్పంగా ఎంచవద్దు.
Nehemiah 9:34 in Telugu 34 మా రాజులు, ప్రధానులు, యాజకులు, మా పూర్వీకులు నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోలేదు. నువ్వు వారికి ఇచ్చిన హెచ్చరికలను, నీ ఆజ్ఞలను వారు పెడచెవిన పెట్టారు.
Isaiah 30:10 in Telugu 10 దర్శనాలు చూసే వాళ్ళతో “దర్శనం చూడవద్దు” అని చెప్తారు. ప్రవక్తలకు “కచ్చితమైన సత్యాన్ని మాకు ప్రవచించ వద్దు. మృదువైన సంగతులే మాతో చెప్పండి. మాయా దర్శనాలు చూడండి. తప్పుడు ప్రవచనాలు మాకు చెప్పండి.
Jeremiah 6:16 in Telugu 16 యెహోవా చెప్పేదేమంటే, రహదారుల్లో నిలబడి చూడండి. పురాతన మార్గాలు ఏవో వాకబు చేయండి. “ఏ మార్గంలో వెళ్తే మేలు కలుగుతుంది?” అని అడిగి అందులో నడవండి. అప్పుడు మీ మనస్సుకు నెమ్మది కలుగుతుంది. అయితే వారు “మేము అందులో నడవం” అని చెబుతున్నారు.
Jeremiah 7:13 in Telugu 13 నేను మీతో పదే పదే మాట్లాడినా మీరు వినలేదు. మిమ్మల్ని పిలిచినా మీరు జవాబు చెప్పకుండా మీరు ఈ పనులన్నీ చేశారు.
Jeremiah 7:25 in Telugu 25 మీ పూర్వికులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకూ నేను ఎడతెగక నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరికి పంపుతూ వచ్చాను.
Jeremiah 25:3 in Telugu 3 “ఆమోను కొడుకు యూదా రాజు యోషీయా 13వ సంవత్సరం మొదలు నేటివరకూ ఈ 23 సంవత్సరాలు యెహోవా నాకు సందేశం ఇస్తూ ఉన్నాడు. నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పటికీ మీరు పెడచెవిన పెట్టారు.
Jeremiah 26:5 in Telugu 5 మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే, నేను ప్రతిసారీ పంపిస్తున్న నా సేవకులైన ప్రవక్తల మాటలు మీరు వినకపోతే
Jeremiah 29:19 in Telugu 19 ఎందుకంటే వాళ్ళు నా మాట వినలేదు,’ ఇది యెహోవా వాక్కు. ‘నా సేవకులైన ప్రవక్తల ద్వారా నా వాక్కు పదేపదే పంపాను. కాని, మీరు వినలేదు’ ఇది యెహోవా వాక్కు.”
Jeremiah 32:32 in Telugu 32 ఈ పట్టణాన్ని కట్టిన రోజు నుంచి, ఇది నా ఉగ్రతను, నా కోపాన్ని రేకెత్తిస్తూనే ఉంది. ఈ రోజు వరకూ అది జరుగుతూనే ఉంది. కాబట్టి నేను నా ఎదుట నుంచి దాన్ని తొలగిస్తాను.
Jeremiah 44:4 in Telugu 4 అందుకని నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ పదే పదే పంపిస్తూ వచ్చాను. నేను అసహ్యించుకునే ఈ నీచమైన పనులు చేయవద్దు అని చెప్పేందుకు వాళ్ళని పంపాను.
Jeremiah 44:16 in Telugu 16 వాళ్ళిలా అన్నారు. “యెహోవా పేరు మీద నువ్వు చెప్పిన మాట మేం వినం.
Daniel 9:10 in Telugu 10 ఆయన తన సేవకులైన ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి, వాటిని అనుసరించి నడుచుకోవాలని చెప్పాడు. కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు.
Zechariah 1:4 in Telugu 4 మీరు మీ పూర్వీకుల వలే ఉండవద్దు. పూర్వికులైన ప్రవక్తలు ఇలా ప్రకటించారు. సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, మీ దుర్మార్గతను, మీ దుష్ట క్రియలను మానుకుని ప్రవర్తించమని వారికి ప్రకటించినప్పటికీ వాళ్ళు వినలేదు. నా మాట ఆలకించలేదు. ఇదే యెహోవా వాక్కు.”
Zechariah 7:8 in Telugu 8 యెహోవా వాక్కు జెకర్యాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే,
Matthew 21:34 in Telugu 34 కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకు రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు.
Matthew 23:37 in Telugu 37 “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ, దేవుడు నీ దగ్గరికి పంపిన వారిని రాళ్లతో కొట్టి చంపేదానా, కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద చేర్చుకుని దాచిపెడుతుందో అదే విధంగా నేను కూడా నీ పిల్లలను చేర్చుకోవాలని చూశాను గానీ నువ్వు ఇష్టపడలేదు.
Luke 20:10 in Telugu 10 కోతల కాలం వచ్చినపుడు అతడు ఆ ద్రాక్ష తోటలో తన భాగం కోసం రైతుల దగ్గరికి తన పనివాడు ఒకణ్ణి పంపాడు. ఆ రైతులు వాణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపి వేశారు.
Acts 7:51 in Telugu 51 “మీరు మెడ వంచనివారూ, హృదయంలో చెవులలో సున్నతి లేని వారు. మీరు కూడా మీ పూర్వీకుల లాగే ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు.
Acts 13:27 in Telugu 27 యెరూషలేములో నివసిస్తున్నవారు, వారి అధికారులూ, ఆయనను గానీ, ప్రతి విశ్రాంతి దినాన చదివే ప్రవక్తల మాటలను గానీ నిజంగా గ్రహించక, యేసుకు మరణ శిక్ష విధించి ఆ ప్రవచనాలను నెరవేర్చారు.
1 Thessalonians 2:15 in Telugu 15 వారు ప్రభువైన యేసునూ ప్రవక్తలనూ చంపారు. మమ్మల్ని తరిమివేశారు. వారు దేవుణ్ణి సంతోషపెట్టేవారు కాదు. మనుషులందరికీ విరోధులు.