Daniel 4:34 in Telugu 34 ఆ రోజులు ముగిసిన తరువాత నెబుకద్నెజరు అనే నాకు తిరిగి మానవ బుద్ధి వచ్చింది. నా కళ్ళు ఆకాశం వైపు ఎత్తి, సర్వోన్నతుడు, శాశ్వత కాలం ఉండే దేవునికి స్తోత్రాలు చెల్లించి కీర్తించాను. ఆయన అధికారం కలకాలం నిలుస్తుంది. ఆయన రాజ్యం తరతరాలకు ఉంటుంది.
Other Translations King James Version (KJV) And at the end of the days I Nebuchadnezzar lifted up mine eyes unto heaven, and mine understanding returned unto me, and I blessed the most High, and I praised and honoured him that liveth for ever, whose dominion is an everlasting dominion, and his kingdom is from generation to generation:
American Standard Version (ASV) And at the end of the days I, Nebuchadnezzar, lifted up mine eyes unto heaven, and mine understanding returned unto me, and I blessed the Most High, and I praised and honored him that liveth for ever; for his dominion is an everlasting dominion, and his kingdom from generation to generation.
Bible in Basic English (BBE) And at the end of the days, I, Nebuchadnezzar, lifting up my eyes to heaven, got back my reason, and, blessing the Most High, I gave praise and honour to him who is living for ever, whose rule is an eternal rule and whose kingdom goes on from generation to generation.
Darby English Bible (DBY) And at the end of the days I Nebuchadnezzar lifted up mine eyes unto the heavens, and mine understanding returned unto me, and I blessed the Most High, and I praised and honoured him that liveth for ever, whose dominion is an everlasting dominion, and his kingdom is from generation to generation.
World English Bible (WEB) At the end of the days I, Nebuchadnezzar, lifted up my eyes to heaven, and my understanding returned to me, and I blessed the Most High, and I praised and honored him who lives forever; for his dominion is an everlasting dominion, and his kingdom from generation to generation.
Young's Literal Translation (YLT) `And at the end of the days I, Nebuchadnezzar, mine eyes to the heavens have lifted up, and mine understanding unto me returneth, and the Most High I have blessed, and the Age-during Living One I have praised and honoured, whose dominion `is' a dominion age-during, and His kingdom with generation and generation;
Cross Reference Job 1:21 in Telugu 21 “నేను నా తల్లి కడుపులోనుండి దిగంబరిగా వచ్చాను. దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగు గాక.”
Psalm 7:17 in Telugu 17 యెహోవా న్యాయాన్నిబట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. సర్వోన్నతుడైన యెహోవాకు స్తుతి కీర్తన పాడతాను.
Psalm 9:2 in Telugu 2 మహోన్నతుడా! నేను నీ గురించి సంతోషించి హర్షిస్తాను. నీ నామానికి స్తుతి కీర్తన పాడుతాను.
Psalm 10:16 in Telugu 16 ఎన్నటెన్నటికీ యెహోవాయే రాజు. ఆయన తన భూభాగం నుంచి అన్యజాతులను పారదోలుతాడు.
Psalm 50:14 in Telugu 14 దేవునికి నీ కృతజ్ఞతార్పణ సమర్పించు. మహోన్నతుడికి నీ ప్రమాణాలను నెరవేర్చు.
Psalm 90:1 in Telugu 1 దేవుని మనిషి మోషే ప్రార్థన. ప్రభూ, తరతరాలుగా నువ్వే మాకు నివాసస్థానం.
Psalm 92:1 in Telugu 1 విశ్రాంతి దినం కోసం పాట, ఒక కీర్తన. యెహోవాకు కృతఙ్ఞతలు చెప్పడం, మహోన్నతుడా, నీ నామానికి స్తుతి పాడడం మంచిది.
Psalm 102:24 in Telugu 24 నేనిలా అన్నాను, నా దేవా, నడివయస్సులో నన్ను తీసి వేయవద్దు. నువ్వు తరతరాలూ ఇక్కడ ఉన్నావు.
Psalm 103:1 in Telugu 1 దావీదు కీర్తన. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.
Psalm 107:8 in Telugu 8 ఆయన నిబంధన విశ్వసనీయతనుబట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
Psalm 107:15 in Telugu 15 ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
Psalm 107:22 in Telugu 22 వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యాలను ప్రకటించుదురు గాక.
Psalm 107:31 in Telugu 31 ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
Psalm 121:1 in Telugu 1 యాత్రల కీర్తన కొండల వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడనుండి వస్తుంది?
Psalm 123:1 in Telugu 1 యాత్రల కీర్తన పరలోకంలో సింహాసనంపై ఆసీనుడై ఉన్నవాడా, నా కన్నులెత్తి నీ వైపు చూస్తున్నాను.
Psalm 130:1 in Telugu 1 యాత్రల కీర్తన యెహోవా, లోతైన లోయలో ఉండి నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను.
Psalm 145:13 in Telugu 13 నీ రాజ్యం కలకాలం ఉంటుంది. నీ రాజ్య పరిపాలన తరతరాలు నిలిచి ఉంటుంది.
Psalm 146:10 in Telugu 10 యెహోవా శాశ్వతంగా రాజ్యపాలన చేస్తాడు. సీయోనూ, అయన తరతరాలకు నీ దేవుడు. యెహోవాను స్తుతించండి.
Isaiah 9:6 in Telugu 6 ఎందుకంటే మన కోసం ఒక బిడ్డ పుట్టాడు. మనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది. ఆయన భుజాల మీద పరిపాలన ఉంటుంది. ఆయనకు ఆశ్చర్యమైన ఆలోచనకర్త, శక్తిశాలి అయిన దేవుడు, శాశ్వతుడైన తండ్రి, శాంతిసమాధానాల అధిపతి అని పేరు.
Isaiah 24:15 in Telugu 15 దాన్ని బట్టి తూర్పు ప్రాంతీయులారా, యెహోవాను ఘనపరచండి. సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామాన్ని ఘనపరచండి.
Jeremiah 10:10 in Telugu 10 అయితే యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే సజీవుడైన దేవుడు, శాశ్వతమైన రాజు. ఆయన కోపాన్ని చూస్తే భూమి కంపిస్తుంది. ఆయన కోపాన్ని రాజ్యాలు తట్టుకోలేవు.
Lamentations 3:19 in Telugu 19 నా బాధ, నా దురవస్థ, నేను తాగిన ద్రావకపు చేదు నేను గుర్తు చేసుకుంటున్నాను.
Lamentations 3:38 in Telugu 38 మహోన్నతుడైన దేవుని నోట్లో నుంచి కీడు, మేలు రెండూ బయటకు వస్తాయి గదా?
Daniel 2:44 in Telugu 44 ఆ రాజుల కాలంలో పరలోకంలో ఉన్న దేవుడు శాశ్వతంగా నిలిచి ఉండే వేరే ఒక రాజ్యం నెలకొల్పుతాడు. ఆ రాజ్యాన్ని పొందిన వాళ్ళ చేతుల్లో నుంచి దాన్ని వేరే ఇంకెవ్వరూ స్వాధీనం చేసుకోలేరు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటినీ తుత్తునియలు చేస్తుంది. అది శాశ్వతంగా నిలుస్తుంది.
Daniel 4:3 in Telugu 3 ఆయన చేసే సూచక క్రియలు బ్రహ్మాండమైనవి. ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యం శాశ్వతంగా ఉండేది. ఆయన అధికారం తరతరాలకు నిలుస్తుంది.”
Daniel 4:16 in Telugu 16 “మానవ మనస్సుకు బదులు పశువు మనస్సు కలిగి ఏడు కాలాలు గడిచేదాకా అతడు అదే స్థితిలో ఉండిపోవాలి.
Daniel 4:26 in Telugu 26 చెట్టు మొద్దును ఉండనియ్యమని దూతలు చెప్పారు గదా. ఇందునుబట్టి సర్వోన్నతుడైన దేవుడు సమస్తానికి అధికారి అని నువ్వు గ్రహించిన తరువాత నీ రాజ్యం నీకు కచ్చితంగా లభిస్తుందని తెలుసుకో.
Daniel 4:32 in Telugu 32 రాజ్యంలోని ప్రజలు తమ దగ్గర నుండి నిన్ను తరుముతారు. నువ్వు అడవిలో జంతువుల మధ్య నివాసం చేస్తావు. పశువులాగా గడ్డి మేస్తావు. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యాలపై అధికారిగా ఉండి, ఆయన ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో వాళ్లకు అనుగ్రహిస్తాడు అని నువ్వు తెలుసుకునే వరకూ ఏడు కాలాలపాటు నీ పట్ల ఇలా జరుగుతుంది” అని వినిపించింది.
Daniel 5:21 in Telugu 21 అతణ్ణి మనుషుల మధ్య నుండి తరిమివేశాడు. అతడి మనసు పశువుల మనసులా మారిపోయింది. అతడు అడవి గాడిదలాగా గడ్డి మేస్తూ ఆకాశం నుంచి పడే మంచుకు తడిసిపోయాడు. మహోన్నతుడైన దేవుడే మనుషుల మీదా, రాజ్యాల మీదా సర్వాధికారి అనీ, ఆయన ఎవరిని వాటిపై నియమించాలనుకున్నాడో వాళ్ళను నియమిస్తాడనీ గ్రహించే వరకూ అదే స్థితిలో ఉండిపోయాడు.”
Daniel 6:26 in Telugu 26 నా సమక్షంలో నిర్ణయం జరిగినట్టుగా, నా రాజ్యంలో ఉన్న సమస్త ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా దానియేలు సేవించే దేవునికి భయపడుతూ ఆయన సన్నిధిలో వణకుతూ ఉండాలి. ఆయనే సజీవుడైన దేవుడు, ఆయన యుగయుగాలకు ఉండే దేవుడు. ఆయన రాజ్యం నిరంతరం ఉంటుంది. ఆయన పరిపాలనకు అంతం అంటూ ఉండదు.
Daniel 7:14 in Telugu 14 సకల ప్రజలు, రాష్ట్రాలు, వివిధ భాషలు మాటలాడేవారు ఆయన్ని సేవించేలా ప్రభుత్వం, మహిమ, ఆధిపత్యం ఆయనకు ఇవ్వబడింది. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది. అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పటికీ లయం కాదు.
Daniel 12:7 in Telugu 7 నారబట్టలు వేసుకుని ఏటి ఎగువన ఉన్న మనిషి మాట నేను విన్నాను. అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకు ఎత్తి నిత్యజీవి అయిన ఆయన నామంలో ఒట్టు పెట్టుకుని “ఒక కాలం కాలాలు అర్థకాలం పరిశుద్ధ జనం బలాన్ని కొట్టివేయడం అయిపోయాక వ్యవహారాలన్నీ సమాప్తమై పోతాయి” అన్నాడు.
Jonah 2:2 in Telugu 2 “నా ఆపదలో నేను యెహోవాకు మొర్రపెట్టాను. ఆయన నాకు జవాబిచ్చాడు. మృత్యులోకం నుంచి నేను కేకలు వేస్తే నువ్వు నా స్వరం విన్నావు.
Micah 4:7 in Telugu 7 కుంటివారిని శేషంగా దూరంగా పంపేసిన వారిని బలమైన ప్రజగా చేస్తాను. యెహోవానైన నేను, సీయోను కొండ మీద ఇప్పటినుంచి ఎప్పటికీ వారిని పాలిస్తాను.
Luke 1:33 in Telugu 33 ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని ఆమెతో చెప్పాడు.
Luke 18:13 in Telugu 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.
John 5:26 in Telugu 26 తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండడానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు.
1 Timothy 1:17 in Telugu 17 అన్ని యుగాల్లో రాజూ, అమర్త్యుడూ, అదృశ్యుడూ అయిన ఏకైక దేవునికి ఘనత, మహిమ యుగయుగాలు కలగాలి. ఆమేన్.
1 Timothy 6:16 in Telugu 16 ఆయన మాత్రమే అమరత్వం కలిగి సమీపింప శక్యం గాని తేజస్సులో నివసిస్తున్నాడు. మనుషుల్లో ఎవరూ ఆయనను చూడలేదు, ఎవరూ చూడలేరు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావం కలుగు గాక. ఆమేన్.
Revelation 4:10 in Telugu 10 ఆ ఇరవై నలుగురు పెద్దలూ సింహాసనంపై కూర్చున్న వాడి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశారు. వారు శాశ్వతంగా జీవిస్తున్న వాడికి మొక్కి,
Revelation 10:6 in Telugu 6 పరలోకాన్నీ, భూమినీ, సముద్రాన్నీ, వాటిలో ఉన్నవాటినన్నిటినీ సృష్టించి శాశ్వతంగా జీవిస్తున్న దేవుని నామంలో ఇలా శపథం చేశాడు. “ఇక ఆలస్యం ఉండదు.
Revelation 11:15 in Telugu 15 ఏడవ దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలు ఇలా పలికాయి, “ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యమూ, ఆయన క్రీస్తు రాజ్యమూ అయింది. ఆయన యుగయుగాలు పరిపాలన చేస్తాడు.”