Amos 5:2 in Telugu 2 ఇశ్రాయేలు కన్య కూలిపోయింది. ఆమె ఇంకా ఎప్పటికీ లేవదు. లేపడానికి ఎవరూ లేక ఆమె తన నేల మీద పడి ఉంది.
Other Translations King James Version (KJV) The virgin of Israel is fallen; she shall no more rise: she is forsaken upon her land; there is none to raise her up.
American Standard Version (ASV) The virgin of Israel is fallen; she shall no more rise: she is cast down upon her land; there is none to raise her up.
Bible in Basic English (BBE) The virgin of Israel has been made low, never again to be lifted up: she is stretched out by herself on her land; there is no one to put her on her feet again.
Darby English Bible (DBY) The virgin of Israel is fallen; she shall no more arise: she is cast down upon her land; there is none to raise her up.
World English Bible (WEB) "The virgin of Israel has fallen; She shall rise no more. She is cast down on her land; There is no one to raise her up."
Young's Literal Translation (YLT) `Fallen, not again to rise, hath the virgin of Israel, Left on her land -- she hath no raiser up.'
Cross Reference 2 Kings 15:29 in Telugu 29 ఇశ్రాయేలు రాజు పెకహు రోజుల్లో అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరు వచ్చి ఈయోను పట్టణాన్ని, ఆబేల్ బేత్మయకా పట్టణాన్ని, యానోయహు పట్టణాన్ని, కెదెషు పట్టణాన్ని, హాసోరు పట్టణాన్ని, గిలాదు ప్రాంతాన్ని, గలిలయ ప్రాంతాన్ని, నఫ్తాలీ ప్రాంతమంతా చెరపట్టుకుని అక్కడ ఉన్నవాళ్ళను అష్షూరు దేశానికి బందీలుగా తీసుకు పోయాడు.
2 Kings 17:16 in Telugu 16 వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా రెండు దూడల పోత విగ్రహాలను చేసి దేవతాస్తంభాలు నిలబెట్టి, నక్షత్రాలనూ, బయలు దేవుణ్ణి పూజించారు.
Isaiah 3:8 in Telugu 8 తన మాటలు, చేతలు యెహోవాకు విరుద్ధంగా ఉన్నాయి గనుక యెరూషలేము పాడైపోయింది, యూదా పతనమయ్యింది.
Isaiah 14:21 in Telugu 21 తమ పూర్వీకుల అపరాధం కారణంగా అతని కొడుకులను హతం చేసే స్థలం సిద్ధం చెయ్యండి. వాళ్ళు పెరిగి భూమిని స్వాధీనం చేసుకుని పట్టణాలతో లోకాన్ని నింపకూడదు.”
Isaiah 24:20 in Telugu 20 భూమి మత్తెక్కిన వాడిలాగా అదే పనిగా తూలుతోంది. పాకలాగా ఇటు అటు ఊగుతోంది. దాని అపరాధం దాని మీద భారంగా ఉంది. అది పడి ఇక లేవదు. భయంకరమైన వార్త విని పారిపోయే వాడు గుంటలో పడిపోతాడు. గుంటను తప్పించుకునేవాడు ఉరిలో చిక్కుతాడు.
Isaiah 37:22 in Telugu 22 అతని గూర్చి యెహోవా సెలవిచ్చే మాట ఇదే, “కన్య అయిన సీయోను ఆడపడుచు నిన్ను తిరస్కరించి, అపహసిస్తున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది.
Isaiah 43:17 in Telugu 17 రథాలూ, గుర్రాలూ, సైన్యాన్నీ యుద్ధవీరుల్నీ రప్పించినవాడూ అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు, వారంతా ఒకేసారి పడిపోయారు. ఆరిపోయిన జనపనారలాగా మళ్ళీ లేవకుండా నాశనమైపోయారు.
Isaiah 51:17 in Telugu 17 యెరూషలేమా! లే. లేచి నిలబడు. యెహోవా చేతినుంచి కోపంతో నిండిన పాత్రను తీసుకుని తాగినదానా! నువ్వు పాత్రలోనిదంతా తాగావు. తూలేలా తాగావు.
Jeremiah 2:27 in Telugu 27 వారు నా వైపు నేరుగా చూడకుండా తమ వీపు తిప్పుకున్నారు. అయినా ఆపద సమయంలో మాత్రం, ‘వచ్చి మమ్మల్ని రక్షించు’ అని నన్ను వేడుకుంటారు.
Jeremiah 4:20 in Telugu 20 కీడు తరవాత కీడు వస్తూ ఉంది. దేశమంతా నాశనమైంది. హటాత్తుగా నా గుడారాలు, క్షణాల్లో వాటి తెరలు పాడైపోయాయి.
Jeremiah 14:17 in Telugu 17 “నువ్వు వాళ్ళతో ఈ మాటలు చెప్పు, కన్య అయిన నా ప్రజల కూతురు ఘోరంగా పతనమవుతుంది. అది మానని పెద్ద గాయం పాలవుతుంది. రాత్రి, పగలు నా కళ్ళ నుంచి కన్నీళ్లు కారనివ్వండి.
Jeremiah 18:13 in Telugu 13 కాబట్టి యెహోవా ఇలా చెబుతున్నాడు, రాజ్యాలను అడిగి తెలుసుకోండి. ఇలాంటిది ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? ఇశ్రాయేలు కన్య చాలా ఘోరమైన పని చేసింది.
Jeremiah 30:12 in Telugu 12 యెహోవా ఇలా అంటున్నాడు, ‘నీ దెబ్బ నయం కాదు. నీ గాయం మానని పుండుగా అయ్యింది.
Jeremiah 31:4 in Telugu 4 ఇశ్రాయేలు కన్యా, నువ్వు నిర్మాణం అయ్యేలా నేను నిన్ను మళ్ళీ కడతాను. నువ్వు మళ్ళీ తంబురలు వాయిస్తావు. సంతోష నాట్యాలతో బయటకు వెళ్తావు.
Jeremiah 50:32 in Telugu 32 అహంకారి తడబడి కింద పడతాడు. వాణ్ణి ఎవరూ పైకి లేపరు. నేను అతడి పట్టణాల్లో అగ్ని రాజేస్తాను. అతని చుట్టూ ఉన్నదాన్ని అది మింగి వేస్తుంది.”
Jeremiah 51:64 in Telugu 64 ‘బబులోను ఇలాగే మునిగిపోతుంది. ఆమెకు విరోధంగా నేను పంపబోయే విపత్తుల కారణంగా అది ఇక పైకి లేవదు. దాని ప్రజలు కూలిపోతారు.’అని ప్రకటించు.” దీంతో యిర్మీయా మాటలు ముగిసాయి.
Lamentations 1:16 in Telugu 16 వీటిని బట్టి నేను ఏడుస్తున్నాను. నా కంట నీరు కారుతోంది. నా ప్రాణం తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వాళ్ళు నాకు దూరమైపోయారు. శత్రువులు విజయం సాధించారు గనుక నా పిల్లలు దిక్కుమాలిన వాళ్ళయ్యారు.
Lamentations 2:13 in Telugu 13 యెరూషలేము కుమారీ, నీ గురించి నేనేమనాలి? నిన్ను దేనితో పోల్చి ఆదరించాలి? సీయోను కుమారీ, కన్యకా, నీ పతనం సముద్రమంత విస్తారమైనది. నిన్ను స్వస్థపరచగల వాడెవడు?
Ezekiel 16:36 in Telugu 36 ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “నువ్వు నీ వ్యభిచార క్రియల ద్వారా నీ ప్రేమికులతోనూ, అసహ్యమైన నీ ప్రతిమలన్నిటితోనూ నీ కామం ఒలకబోసి నీ అంగప్రదర్శన చేశావు గనుక, ఆ విగ్రహాలకు నువ్వు నీ పిల్లలను బలి ఇచ్చి వాళ్ళ రక్తం చిందించావు గనుక,
Hosea 6:2 in Telugu 2 రెండు రోజుల తరువాత ఆయన మనలను బ్రతికిస్తాడు. మనం ఆయన సముఖంలో బ్రతికేలా, మూడవ రోజున ఆయన మనలను తిరిగి లేపుతాడు.
Hosea 14:1 in Telugu 1 ఇశ్రాయేలూ, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు.
Amos 7:2 in Telugu 2 అవి పచ్చికనంతా తినేసినప్పుడు నేనిలా అన్నాను. “యెహోవా ప్రభూ, దయచేసి క్షమించు. యాకోబు వంశం కొద్దిమందేగా. అది ఎలా నిలదొక్కుకుంటుంది”
Amos 8:14 in Telugu 14 సమరయ పాపంతో ఒట్టు పెట్టుకునే వారు, ‘దానూ, నీ దేవుని ప్రాణం మీద ఒట్టు.’ ‘బెయేర్షెబా, దేవుని ప్రాణం మీద ఒట్టు’ అనేవారు ఇంకా ఎన్నడూ లేవలేకుండా కూలిపోతారు.”
Amos 9:11 in Telugu 11 పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ రోజు నేను లేవనెత్తి దాని గోడలను బాగుచేస్తాను. శిథిలాలను లేపుతాను. ముందు ఉన్నట్టు దాన్ని తిరిగి నిర్మిస్తాను.