Acts 15:17 in Telugu 17 పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి నిర్మిస్తాననీ పాడైన వాటిని తిరిగి కట్టి వాటిని నిలబెడతాననీ
Other Translations King James Version (KJV) That the residue of men might seek after the Lord, and all the Gentiles, upon whom my name is called, saith the Lord, who doeth all these things.
American Standard Version (ASV) That the residue of men may seek after the Lord, And all the Gentiles, upon whom my name is called,
Bible in Basic English (BBE) So that the rest of men may make search for the Lord, and all the Gentiles on whom my name is named,
Darby English Bible (DBY) so that the residue of men may seek out the Lord, and all the nations on whom my name is invoked, saith [the] Lord, who does these things
World English Bible (WEB) That the rest of men may seek after the Lord; All the Gentiles who are called by my name, Says the Lord, who does all these things.
Young's Literal Translation (YLT) that the residue of men may seek after the Lord, and all the nations, upon whom My name hath been called, saith the Lord, who is doing all these things.
Cross Reference Genesis 22:18 in Telugu 18 నువ్వు నా మాట విన్నావు కనుక నీ సంతానం వల్ల భూమి పైన ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.”
Genesis 48:16 in Telugu 16 సమస్త కీడుల నుంచి నన్ను కాపాడిన దూత, ఈ పిల్లలను దీవించు గాక. నా పేరు, అబ్రాహాము ఇస్సాకులనే నా పితరుల పేరు వారికి కలుగు గాక. లోకంలో వారు విస్తార జనసమూహంగా అవుతారు గాక” అన్నాడు.
Genesis 49:10 in Telugu 10 షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు. అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు. రాజ్యాలు అతనికి లోబడతాయి.
Numbers 6:27 in Telugu 27 ఈ విధంగా వారు ఇశ్రాయేలు ప్రజలకి నా నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. నేను అప్పుడు వారిని దీవిస్తాను.”
Numbers 24:23 in Telugu 23 అప్పుడు అతడు ప్రవచనంగా చెప్తూ “అయ్యో! దేవుడు ఇలా చేసినప్పుడు ఎవరు బతుకుతారు?
Psalm 22:26 in Telugu 26 బాధితులు భోజనం చేసి తృప్తి పొందుతారు. యెహోవాను వెదికేవాళ్ళు ఆయనను స్తుతిస్తారు. మీ హృదయాలు శాశ్వతకాలం జీవిస్తాయి గాక.
Psalm 67:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుని కోసం. తీగెల వాద్యాలపై పాడేది. దేవుడు మమ్మల్ని కనికరించి ఆశీర్వదిస్తాడు గాక. ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేస్తాడు గాక
Psalm 72:17 in Telugu 17 రాజు నామం శాశ్వతంగా నిలుస్తుంది గాక. అతని పేరు సూర్యుడున్నంత కాలం నిలబడుతుంది గాక. అతనిని బట్టి ప్రజలు దీవెనలు పొందుతారు గాక. అన్యజనాలు అతడు ధన్యుడని చెప్పుకుంటారు గాక.
Isaiah 2:2 in Telugu 2 చివరి రోజుల్లో పర్వతాలన్నిటికన్నా యెహోవా మందిర పర్వతం ఉన్నతంగా సుస్థిరమౌతుంది. అన్ని కొండల కంటే ఘనత పొందుతుంది. జాతులన్నీ దానిలోకి ప్రవాహంలా వస్తారు.
Isaiah 11:10 in Telugu 10 ఆ రోజున ప్రజలకు ధ్వజంగా యెష్షయి వేరు నిలుస్తుంది. జాతులు ఆయన కోసం వెదకుతాయి. ఆయన విశ్రమించే స్థలం ప్రభావం కలది అవుతుంది.
Isaiah 19:23 in Telugu 23 ఆ రోజున ఐగుప్తు దేశం నుండి అష్షూరు దేశానికి ఒక రాజ మార్గం ఉంటుంది. అష్షూరు ప్రజలు ఐగుప్తుకీ, ఐగుప్తు ప్రజలు అష్షూరుకీ వస్తూ పోతూ ఉంటారు. ఐగుప్తు ప్రజలు అష్షూరు ప్రజలతో కలసి యెహోవాను ఆరాధిస్తారు.
Isaiah 24:15 in Telugu 15 దాన్ని బట్టి తూర్పు ప్రాంతీయులారా, యెహోవాను ఘనపరచండి. సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామాన్ని ఘనపరచండి.
Isaiah 43:7 in Telugu 7 నా మహిమ కోసం నేను సృజించి నా పేరు పెట్టినవారందరినీ పోగుచెయ్యి. వారిని కలగజేసింది, వారిని పుట్టించింది నేనే.
Isaiah 45:7 in Telugu 7 వెలుగును సృజించే వాణ్ణీ చీకటిని కలిగించే వాణ్ణీ నేనే. శాంతినీ, విపత్తులనూ కలిగించే వాణ్ణి నేనే. యెహోవా అనే నేనే వీటన్నిటినీ కలిగిస్తాను.
Isaiah 49:6 in Telugu 6 “నువ్వు యాకోబు గోత్రాలను ఉద్ధరించడానికీ ఇశ్రాయేలులో తప్పించుకున్నవాళ్ళను తీసుకురావడానికీ నా సేవకుడుగా ఉండడం ఎంతో చిన్న విషయం. నువ్వు ప్రపంచమంతా నా రక్షణగా ఉండడానికి నిన్ను యూదేతరులకు వెలుగుగా చేస్తాను.”
Isaiah 65:1 in Telugu 1 “నా విషయం అడగని వారిని నా దగ్గరికి రానిచ్చాను. నన్ను వెదకని వారికి నేను దొరికాను. నన్ను పిలవని రాజ్యంతో ‘నేనున్నాను, ఇదిగో నేనున్నాను’ అన్నాను.
Isaiah 66:18 in Telugu 18 వాళ్ళ పనులూ వాళ్ళ ఆలోచనలూ నాకు తెలుసు. అన్ని తెగలనూ వివిధ భాషలు మాట్లాడే వారినీ ఒక చోట చేర్చే సమయం రాబోతుంది. వాళ్ళు వచ్చి నా ఘనత చూస్తారు.
Jeremiah 14:9 in Telugu 9 కలవరపడిన వాడిలా, ఎవరినీ కాపాడలేని శూరునిలా నువ్వెందుకున్నావు? యెహోవా, నువ్వు మా మధ్య ఉన్నావు! నీ పేరు మా మీద నిలిచి ఉంది. మమ్మల్ని విడిచి పెట్టవద్దు.
Jeremiah 16:19 in Telugu 19 యెహోవా, నువ్వే నా బలం. నా దుర్గం. దురవస్థలో ఆశ్రయంగా ఉన్నావు. ప్రపంచమంతటి నుంచి రాజ్యాలు నీ దగ్గరికి వచ్చి “మా పూర్వీకులు, వ్యర్ధాన్ని స్వతంత్రించుకున్నారు. అవి వట్టివి. అవి పనికిమాలినవి” అని చెబుతారు.
Daniel 4:35 in Telugu 35 భూలోకంలోని ప్రజలంతా ఆయన దృష్టిలో శూన్యులు. ఆయన పరలోకంలోని సైన్యాల మీదా, భూలోకంలోని ప్రజల మీదా తన ఇష్టం వచ్చినట్టు జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని “నువ్వు చేస్తున్నదేమిటి?” అని అడిగే అధికారం ఎవ్వరికీ లేదు.
Daniel 9:19 in Telugu 19 ప్రభూ ఆలకించు, ప్రభూ క్షమించు, ప్రభూ ఆలస్యం చేయక విని నా మనవి ప్రకారం దయ చెయ్యి. నా దేవా, ఈ నగరం, ఈ ప్రజ నీ పేరున ఉన్నవే. నీ ఘనతను బట్టి మాత్రమే నా ప్రార్థన విను” అని వేడుకున్నాను.
Hosea 2:23 in Telugu 23 నేను ఆమెను భూమిలో నాకోసం నాటుతాను. లో రుహమా పై నేను జాలి పడతాను. నా ప్రజలు కానివారితో “మీరే నా ప్రజలు” అని నేను చెప్పగా, వారు “నీవే మా దేవుడివి” అంటారు. ఇదే యెహోవా వాక్కు.
Joel 2:32 in Telugu 32 యెహోవా పేరున ప్రార్థనచేసే వారందరినీ కాపాడడం జరుగుతుంది. యెహోవా చెప్పినట్టు సీయోను కొండమీద, యెరూషలేములో తప్పించుకున్నవారుంటారు. యెహోవా ఏర్పాటు చేసుకున్నవాళ్ళు మిగులుతారు.”
Amos 9:12 in Telugu 12 వాళ్ళు ఎదోములో మిగిలిన వారిని నా పేరు పెట్టుకున్న రాజ్యాలన్నీ నా ప్రజలు స్వాధీనం చేసుకునేలా చేస్తాను. ఇలా చేసే యెహోవా ప్రకటన ఇదే.
Micah 4:1 in Telugu 1 చివరిరోజుల్లో యెహోవా మందిర పర్వతం పర్వతాలన్నిట్లో ప్రధానమైనదిగా ఉంటుంది. కొండల కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రజల సమూహాలు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు.
Micah 5:7 in Telugu 7 యాకోబు సంతానంలో మిగిలినవారు అనేక ప్రజల మధ్య నివసిస్తూ, యెహోవా కురిపించే మంచులాగా, మానవ ప్రయత్నం, ఆలోచన లేకుండ, గడ్డి మీద పడే వానలాగా ఉంటారు.
Zechariah 2:11 in Telugu 11 ఆ రోజున చాలామంది అన్య దేశాల ప్రజలు యెహోవా చెంతకు చేరుకుని నా ప్రజలుగా అవుతారు. నేను మీ మధ్య నివాసం చేస్తాను. అప్పుడు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపాడని మీరు తెలుసుకుంటారు.
Zechariah 8:20 in Telugu 20 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే “జాతులు, అనేక పట్టణాల నివాసులు ఇంకా వస్తారు.
Malachi 1:11 in Telugu 11 తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకూ ఇతర దేశాల ప్రజల్లో నా పేరును అంతా గౌరవిస్తారు. అన్ని ప్రాంతాల్లో నా పేరుకు ధూప నైవేద్యాలు, పవిత్రమైన అర్పణలు అర్పిస్తారు. అన్య దేశాల ప్రజల్లో నా పేరును ఉన్నతంగా ఎంచుతారు. అని సేనల ప్రభువైన యెహోవా చెబుతున్నాడు.