2 Peter 2:10 in Telugu 10 ముఖ్యంగా ప్రభుత్వాన్ని తోసిపుచ్చుతూ, అపవిత్రమైన శరీర ఆశలను తీర్చుకుంటూ, తెగువతో, అహంకారంతో, పరలోక సంబంధులను దూషించడానికి భయపడని వారి విషయంలో ఇది నిజం.
Other Translations King James Version (KJV) But chiefly them that walk after the flesh in the lust of uncleanness, and despise government. Presumptuous are they, selfwilled, they are not afraid to speak evil of dignities.
American Standard Version (ASV) but chiefly them that walk after the flesh in the lust of defilement, and despise dominion. Daring, self-willed, they tremble not to rail at dignities:
Bible in Basic English (BBE) But specially those who go after the unclean desires of the flesh, and make sport of authority. Ready to take chances, uncontrolled, they have no fear of saying evil of those in high places:
Darby English Bible (DBY) and specially those who walk after the flesh in [the] lust of uncleanness, and despise lordship. Bold [are they], self-willed; they do not fear speaking injuriously of dignities:
World English Bible (WEB) but chiefly those who walk after the flesh in the lust of defilement, and despise authority. Daring, self-willed, they are not afraid to speak evil of dignitaries;
Young's Literal Translation (YLT) and chiefly those going behind the flesh in desire of uncleanness, and lordship despising; presumptuous, self-complacent, dignities they are not afraid to speak evil of,
Cross Reference Genesis 49:6 in Telugu 6 నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు. నా హృదయం వారితో కలవలేనంత ఉదాత్తమైనది. కోపంలో వారు మనుషులను చంపారు. సరదా కోసం ఎద్దుల కాళ్ళ నరాలు తెగ్గొట్టారు.
Exodus 22:28 in Telugu 28 నువ్వు దేవుణ్ణి దూషించకూడదు. నీ ప్రజల అధికారుల్లో ఎవరినీ శపించ కూడదు.
Numbers 15:30 in Telugu 30 కాని, దేశంలో పుట్టినవాడు గాని పరదేశి గాని ఎవరైనా కావాలని పాపం చేస్తే,
Numbers 16:12 in Telugu 12 అప్పుడు మోషే ఏలీయాబు కొడుకులు దాతాను అబీరాములను పిలిపించాడు.
Deuteronomy 17:12 in Telugu 12 ఆ ప్రదేశంలో ఎవరైనా అహంకారంతో మీ యెహోవా దేవునికి పరిచర్య చేయడానికి నిలిచే యాజకుని మాటగానీ ఆ న్యాయాధిపతి మాటగానీ వినకపోతే అతన్ని చంపివేయాలి. ఆ విధంగా దుర్మార్గాన్ని ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి రూపుమాపాలి.
Deuteronomy 21:20 in Telugu 20 మా కొడుకు మొండివాడై తిరగబడ్డాడు. మా మాట వినక తిండిబోతూ తాగుబోతూ అయ్యాడు, అని ఊరి పెద్దలతో చెప్పాలి.
1 Samuel 10:27 in Telugu 27 అసూయపరులూ, దుష్టులూ అయిన కొందరు “ఈ మనిషి మనలను ఏలుతాడా?” అని చెప్పుకొంటూ అతడిని పట్టించుకోకుండా, కానుకలు ఇవ్వకుండా ఉన్నప్పుడు సౌలు ఏమీ పట్టించుకోకుండా చెవిటి వాడిలాగా నెమ్మదిగా ఉండిపోయాడు.
2 Samuel 20:1 in Telugu 1 బెన్యామీను గోత్రానికి చెందిన బిక్రి కొడుకు షెబ అనే పనికిమాలినవాడు ఒకడున్నాడు. వాడు “ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా మీ మీ సొంత స్థలాలకు వెళ్ళిపొండి. దావీదులో మనకు పాలు లేదు, యెష్షయి కుమారుడిలో మనకు వాటా ఎంతమాత్రమూ రాదు” అంటూ బాకా ఊది గట్టిగా ప్రకటించాడు.
1 Kings 12:16 in Telugu 16 కాబట్టి ఇశ్రాయేలు వారంతా రాజు తమ విన్నపం వినలేదని తెలుసుకుని రాజుకిలా బదులిచ్చారు: “దావీదు వంశంతో మాకేం సంబంధం? యెష్షయి కొడుకుతో మాకు వారసత్వం ఏముంది? ఇశ్రాయేలు ప్రజలారా, మీ మీ గుడారాలకు వెళ్ళండి. దావీదు వంశమా, నీ వంశం సంగతి నువ్వే చూసుకో.” ఇలా చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారాలకు వెళ్లిపోయారు.
Psalm 2:1 in Telugu 1 జాతులు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాయి? ప్రజా సమూహాలు ఎందుకు వ్యర్ధమైన కుట్ర చేస్తున్నాయి?
Psalm 12:4 in Telugu 4 మా నాలుకలతో మేము సాధిస్తాం, మా పెదాలతో మేము మాట్లాడినప్పుడు మా మీద ప్రభువుగా ఎవరు ఉండగలరు? అని అంటున్నది వీళ్ళే.
Ecclesiastes 10:6 in Telugu 6 ఏమంటే మూర్ఖులను పెద్ద పదవుల్లో, గొప్పవారిని వారి కింద నియమించడం.
Ecclesiastes 10:20 in Telugu 20 నీ మనస్సులో కూడా రాజును శపించవద్దు, నీ పడక గదిలో కూడా ధనవంతులను శపించవద్దు. ఎందుకంటే ఏ పక్షి అయినా ఆ సమాచారాన్ని మోసుకుపోవచ్చు. రెక్కలున్న ఏదైనా సంగతులను తెలియజేయవచ్చు.
Jeremiah 2:31 in Telugu 31 ఇప్పటి తరం ప్రజలు యెహోవా చెప్పే మాట వినండి, నేను ఇశ్రాయేలుకు ఒక అరణ్యం లాగా అయ్యానా? గాఢాంధకారంతో నిండిన దేశంలా అయ్యానా? “మాకు స్వేచ్ఛ లభించింది, ఇంక నీ దగ్గరికి రాము” అని నా ప్రజలెందుకు చెబుతున్నారు?
Luke 19:14 in Telugu 14 అయితే అతని పట్టణంలోని పౌరులు అతణ్ణి ద్వేషించారు. ‘ఇతడు మమ్మల్ని పరిపాలించడం మాకు ఇష్టం లేదు’ అంటూ అతని వెనుకే రాయబారం పంపారు.
Acts 23:5 in Telugu 5 అందుకు పౌలు, “సోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. ‘నీ ప్రజల అధికారిని నిందించవద్దు’ అని రాసి ఉంది” అన్నాడు.
Romans 1:24 in Telugu 24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు.
Romans 8:1 in Telugu 1 ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.
Romans 8:12 in Telugu 12 కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దానికేమీ రుణపడి లేము.
Romans 13:1 in Telugu 1 ప్రతి ఒక్కడూ తన పై అధికారులకు లోబడాలి. ఎందుకంటే దేవుని వల్ల కలిగింది తప్ప అధికారం మరేదీ లేదు. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే.
1 Corinthians 6:9 in Telugu 9 అవినీతిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు. లైంగిక దుర్నీతికి పాలుపడే వారూ, విగ్రహాలను పూజించేవారూ, మగ వేశ్యలు, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులూ, విపరీత సంపర్కం జరిపే వారూ,
2 Corinthians 10:3 in Telugu 3 మేము శరీరంతో జీవిస్తున్నా శరీరానుసారంగా యుద్ధం చేయం.
Ephesians 4:19 in Telugu 19 వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.
Ephesians 5:5 in Telugu 5 మీకు తెలుసు. వ్యభిచారులూ అపవిత్రులూ అత్యాశపరులూ క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు. అత్యాశాపరులు విగ్రహారాధికులతో సమానం.
Colossians 3:5 in Telugu 5 కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి.
1 Thessalonians 4:7 in Telugu 7 పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు.
Titus 1:7 in Telugu 7 అధ్యక్షుడు దేవుని ఇంటి సేవ నిర్వహించేవాడు కాబట్టి నిందారహితుడుగా ఉండాలి. అతడు అహంకారి, ముక్కోపి, ద్రాక్ష మద్యానికి అలవాటు పడినవాడు, దెబ్బలాడేవాడు, దురాశపరుడు అయి ఉండకూడదు.
Hebrews 13:4 in Telugu 4 వివాహం అందరూ గౌరవించేదిగా దాంపత్యం పవిత్రంగా ఉండనివ్వండి. లైంగిక అవినీతిపరులనూ, వ్యభిచారులనూ దేవుడు శిక్షిస్తాడు.
1 Peter 2:13 in Telugu 13 ప్రతి మానవ అధికారానికీ ప్రభువును బట్టి లోబడి ఉండండి.
2 Peter 3:3 in Telugu 3 ముందుగా ఇది తెలుసుకోండి, చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించి నడిచే కొందరు బయలుదేరతారు.
Jude 1:4 in Telugu 4 ఎందుకంటే కొంతమంది దొంగచాటుగా వచ్చి దేవుని కృపను లైంగిక అవినీతికి వీలుగా మార్చి, మన ఏకైక యజమాని, ప్రభువైన క్రీస్తును నిరాకరిస్తున్నారు. వీళ్ళు భక్తిహీనులు, శిక్షకు పాత్రులని ముందే రాసి ఉంది.
Jude 1:6 in Telugu 6 తమ స్థానం నిలుపుకోని దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వారిని చీకటిలో నిత్య సంకెళ్ళతో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు.
Jude 1:10 in Telugu 10 కాని వీరు, తమకు అర్థం కాని వాటిని దూషిస్తారు. తెలివిలేని జంతువుల్లాగా ప్రకృతి సిద్ధంగా తెలుసుకోగలిగే వాటివల్లే తమను తాము నాశనం చేసుకుంటున్నారు.
Jude 1:16 in Telugu 16 వారు తమ దురాశలను బట్టి నడచుకుంటూ, లాభం కోసం మనుషులను పొగుడుతూ, తమకు ఉన్న స్థితిని బట్టి సణుగుతూ, ఫిర్యాదులు చేస్తూ ఉంటారు.
Jude 1:18 in Telugu 18 చివరి కాలంలో భక్తిలేని తమ ఆశలననుసరించి నడుచుకొంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని అపొస్తలులు మీతో చెప్పారు.